Tribute to Iconic Sridevi: మొదటి సినిమాకు మదర్ సెంటిమెంట్..అమ్మ గౌనులో మెరిసిన ఖుషి కపూర్..

Khushi Kapoor's Mother Sentiment at the Screening of The Archies

మొదటి సినిమాకు మదర్ సెంటిమెంట్..అమ్మ గౌనులో మెరిసిన ఖుషి కపూర్..

దివంగత నటి అలనాటి అందాల తార శ్రీదేవి భౌతికంగా దూరం అయ్యారే కానీ ఆమె నటన, అందంతో ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.

శ్రీదేవీ మళ్లీ పుడితే బాగుండు అని ఇప్పటికీ ఆమె అభిమానులు ఆకాంక్షిస్తుంటారు. అది నిజం అవుతుందో లేదు తెలియదు కానీ ఆమె వారసురాళ్లు మాత్రం ఇండస్ట్రీలో తల్లి పేరు నిలబెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికీ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. త్వరలో టాలీవుడ్‎లోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీతో ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇక శ్రీదేవీ చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చేసింది. ఈ మధ్యనే ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉంచితే . తాజాగా ఖుషి ఓ ఈవెంట్ లో అద్భుతమైన ఫ్యాషన్ లుక్‎తో మెరిసిపోయింది. తమ మొదటి సినిమా కోసం ఆమె తన తల్లి గౌను వేసుకుని కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

తల్లి డ్రెస్సులో ఖుషి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మదర్ సెంటిమెంట్ అందిరింది అంటూ ఖుషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఖుషి కపూర్ నటించిన మొదటి సినిమా ఆర్చీస్. దీని ప్రీమియర్ షో మంగళారం గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీల వారసులు నటించిన ప్రాజెక్ట్ కావడంతో ఈ ఈవెంట్ తారల రాకతో కొత్త శోభను అల్లుకుంది.

Add a heading 2023 12 06T121636.485 Tribute to Iconic Sridevi: మొదటి సినిమాకు మదర్ సెంటిమెంట్..అమ్మ గౌనులో మెరిసిన ఖుషి కపూర్..

ఈ ప్రీమియర్‌ షో లో ఖుషి కపూర్‌ హైలెట్ గా నిలిచింది. ఒకప్పుడు తన అమ్మ ధరించిన అరుదైన డ్రెస్‌ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.ఈ ఈవెంట్‎లో శ్రీదేవి ఐకానిక్ స్టైల్‎ను ప్రజెంట్ చేసింది. అద్భుతమైన ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది ఖుషి.

బంగారు గౌనులో తన తొలి చిత్రం వేడుకలో ధగధగా మెరిసింది ఈ చిన్నది. ఈ స్పెషల్ డేలో అమ్మను స్మరించుకుంటూ నివాళులు అర్పించింది.

శ్రీదేవి 2013లో IFA రెడ్ కార్పెట్ పైన ఈ బంగారు గౌనును ధరించి అందరి మైండ్ బ్లాక్ చేసింది. క్లిష్టమైన క్రిస్టల్స్ తో డిజైన్ చేసిన ఈ గోల్డెన్ గౌనులో షోస్టాపర్ గా దేవకన్యలా మెరిసింది శ్రీదేవి.

ఇప్పుడు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ బాలీవుడ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ అవుట్ ఫిట్ మరోసారి టాక్ ఆఫి ది టౌన్ గా మారింది.

కేవలం గోల్డెన్ గౌను మాత్రమే కాదు అమ్మ ధరించిన జ్యువెల్లరీని అలంకరించుకుని హైలెట్ గా నిలిచింది. ఇది చూసి శ్రీదేవీ ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు.

జోయా అక్తర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ‘ది ఆర్చీస్’. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా , కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఆర్చీ, బెట్టీ, వెరోనికా, జుగౌడ్, రెగ్గీ, ఎథెల్, డిల్టన్ల జీవితాలను అనుసరించి తీసిన అద్భుతమైన మూవీ ‘ది ఆర్చీస్’. ఈ సినిమా ఫ్రెండ్‎షిప్, ఫ్రీడమ్, లవ్, ఎమోషన్స్ కలయికతో తీసిని మంచి ఎంటర్టైనర్ గా విడుదలకు రెడీ అయ్యింది.

డిసెంబర్ 7 ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్లోలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో స్టార్‌ కిడ్స్ మొదటిసారి స్క్రీన్ మీద మెరవనుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Comment