Triptii Dimri: సూపర్ హిట్ బాలీవుడ్ సిక్వల్ లో ఛాన్స్ కొట్టేసిన తృప్తి డిమ్రి.
యానిమల్ తో ఒక్కసారిగా ఫేమ్..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, రణబీర్ కపూర్, రష్మిక మందన్న కీలకపాత్రలలో నటించిన సినిమా యనిమల్.
ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న కన్నా , తృప్తి డిమ్రి ఎక్కువగా ఫేమస్ అయింది.ఈ ఒక్క సినిమాతో సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ మిలియన్లలో పెరిగిపోయింది.
ఓవర్ నైట్ స్టార్ అయింది తృప్తి డిమ్రీ. యనిమల్ సినిమాలో ఎమోషనల్ మరియు రొమాంటిక్ సన్నివేశాల్లో తన నటనతో ప్రేక్షకులని మెప్పించింది.
ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించినప్పటికి, ఈ సినిమాకి వచ్చినంత ఫేమ్ ఏ సినిమాకు రాలేదు.
యానిమల్ విజయంతో వరుస ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయని సమాచారం.
అయితే ఇటీవల తృప్తి డిమ్రి కాదనలేని ఒక ఆఫర్ వచ్చినట్టుగా బాలీవుడ్ వర్గాలలో చర్చ నడుస్తుంది అదేంటంటే,
సూపర్ హిట్ AASHIQUI సీక్వల్ లో తృప్తి డిమ్రి:
బాలీవుడ్ లో భారీ మ్యూజికల్ కిట్ అయిన AASHIQUI సినిమాకి సీక్వల్ లో తృప్తి డిమ్రిని తీసుకునేందుకు చర్చలు సాగుతున్నాయని సమాచారం.
ఈ AASHIQUI మొదటి భాగం 1990 లో వచ్చింది. ఆ సమయంలో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ తరువాత చాలా కాలానికి దీనికి సీక్వల్ గా AASHIQUI 2 ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్దా కపూర్ లు జంటగా 2013 లో తీశారు.
మొదటి పార్టు లాగే ఇది కూడా చాలా మంచి విజయాన్ని సాధించింది.ప్రస్తుతం ఈ సినిమాకి సిక్వల్ గా AASHIQUI 3 సినిమా తీసేందుకు T సిరీస్ నిర్మాణ సంస్థ సిద్దమవుతున్నారు.
అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక ఆర్యన్ హీరోగా ఈ సినిమా తీయబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం తృప్తి డిమ్రిని హీరోయిన్ గా అనుకుంటున్నారు, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.