Trisha signed 5 films : రెండు దశాబ్ధాలుకు పైగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది కోలీవుడ్ బ్యూటీ త్రిష (Trisha). కెరీర్ స్టార్టింగ్ లో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పరిచమైన త్రిష 2003లో వచ్చిన తరుణ్ (Tharun)సినిమా ‘నీ మనసు నాకు తెలుసు’ (Nee Manasu Naku Telusu)తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. నాలుగు పదుల వయసు దాటినా త్రిష క్రేజ్, అందం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈమె కనిపించిందంటే యూత్ మతులుపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కొంత కాలమే . ఆ తర్వాత ఫేడౌట్ అయిపోతారు. కానీ త్రిష మాత్రం అలా కాదు.
ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఆమె అందం క్రేజ్, ఇండస్ట్రీలో డిమాండ్ పెరుగుతూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ కుర్ర హీరోయిన్లను కూడా పక్కకు నెట్టోస్తోంది ఈ భామ.
Trisha Full busy in Kollywood : కోలీవుడ్ లో త్రిష ఫుల్ బిజీ
త్రిష లైనప్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. వరుశగా అరడజనుకుపైగా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. అవి కూడా ఆశా మాశీ చిత్రాలు కాదండోయ్.
అన్నీ కూడా స్టార్ హీరోల ప్రాజెక్టులే. అమ్మడి ఆఫర్లు చూస్తే ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లు సైతం నోరెళ్లబెట్టాల్సిందే. తమిళ సూపర్ స్టార్ హీరో అజిత్ (Ajith)హీరోగా నటిస్తున్న విదా మువర్చి (Vidaa Muyarchi)లో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది.
ఈ విషయాన్ని త్రిషనే స్వయంగా ప్రకటించింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా విదా మువర్చి తెరకెక్కబోతోంది. మాగిజ్ తిరుమేని (Magizh Thirumeni)డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ (Lika Production)పతాకంపై సుభాస్కరన్ అల్లిరాజా (Subaskaran Allirajah) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా (Arjun Sarja), త్రిష (Trisha), రెజీనా కసాండ్రా (Regina Cassandra) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. .
మే 2023లో సినిమాను అధికారిక టైటిల్‌తో ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. ఇక ‘దృశ్యం’(Drushyam)డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeetu Joseph), మోహన్‌లాల్ (Mohanlal)తో రామ్ (Ram) అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీలోనూ త్రిష (Trisha)నే హీరోయిన్ గా నటిస్తుంది.
Trisha Once again in a Mani Ratnam movie : మరోసారి మణిరత్నం సినిమాలో త్రిష
ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) , డైరెక్టర్ మణిరత్నం (Maniratnam)కాంబోలో వస్తున్న మూవీ ‘థగ్ లైఫ్’ (Thuglife). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నయి. జనవరి 24న, సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను పంచుకుని ఫ్యాన్స్ ను అలరించారు.
‘థగ్ లైఫ్’ ప్రీ ప్రొడక్షన్ పనులు కొన్ని నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. 35 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్‌హాసన్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘థగ్ లైఫ్’.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), త్రిష (Trisha), జయం రవి (Jayam Ravi)’థగ్ లైఫ్’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి కె చంద్రన్ (Ravi K Chandran)సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా ,ఎఆర్ రెహమాన్ (A.R.Rehman) ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ‘థగ్ లైఫ్’ విడుదల చేయాలని మేకరస్ ప్లాన్ చేస్తున్నారు.
Trisha Romance Megastar after 18 years : 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో త్రిష రొమాన్స్ :
పద్మవిభూషన్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న 156వ మూవీ విశ్వంభర (Vishwambhara).బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ (Vasishta) డైరెక్షన్లో భారీ బడ్జట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
ఇటీవల నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలన్న కసితో ఉన్నారు మెగాస్టార్. ఈ మధ్యనే సినిమా కోసం భారీ కసరత్తులు చేసిన వీడియో కూడా నెట్టింట్లో ప్రత్యక్షమైంది.
అన్నయ్య జిమ్ వర్కౌట్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. బియాండ్ యూనివర్స్ అంటూ మేకర్స్ విశ్వంభరను ప్రమోట్ చేస్తున్నారు. దీనిని బట్టి చిరు నటిస్తున్న విశ్వంభర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న కన్ఫ్యూజన్ నటిచింది. అయితే తాజాగా మేకర్స్ త్రిష (Trisha)ను చిరుకు జోడీగా ఫైనల్ గా సెలెక్ట్ చేశారు. దీంతో 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో త్రిషా రొమాన్స్ చేయబోతోంది. విశ్వంభరలో త్రిష హీరోయిన్ అంటూ స్వయంగా మెగాస్టార్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కోలీవుడ్ లో త్రిష కు ఓ రేంజ్ లో డిమాండ్ పెరిగింది.
పొన్నియన్ సెల్వన్ (Ponniyan selvan)తో పాటు ఈ భామ రీసెంట్ గా నటించిన లియో(Leo) బిగ్ హిట్ కావడంతో అమ్మడికి ఆఫర్లు వరుసగా తలుపుతడుతున్నాయి. ఈ క్రమంలోనే విశ్వంభర మేకర్స్ తమ సినిమాలో త్రిషను ఫైలన్ చేశారు. ఇలా వరుసగా టాలీవుడ్ , కోలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కట్టి త్రిష తనకు ఎవరూ సాటిరారంటూ నిరూపిస్తోంది.