Trisha Krishnan : రేటు పెంచిన త్రిష..రెమ్యునరేషన్ విని షాకైన నిర్మాతలు.

Trisha who has increased the rate.. Producers are shocked to hear the remuneration.

Trisha Krishnan : రేటు పెంచిన త్రిష..రెమ్యునరేషన్ విని షాకైన తెలుగు నిర్మాత.

వయసు మీద పడుతున్న కొద్దీ అందం పెరిగిపోతోంది అని పొగిడినందుకో, లేదంటే అసలే లేటు వయసులోకి వచ్చేశాం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందో ఏమోకానీ చెన్నై ముగ్గుగుమ్మ త్రిష తెలుగు నిర్మాతలకు షాక్ ఇచ్చిందట.

తెలుగులో ఓ స్టార్ హీరో సినిమా కోసం, ఒక బడా నిర్మాత త్రిష డేట్స్ కావాలని చెన్నై వెళ్ళాడట. అయితే త్రిష చెప్పిన అమౌంట్ విని మన తెలుగు ప్రొడ్యూసర్ కి పగలే స్టార్స్ కనిపించాయట. అయితే త్రిష తెలుగులో స్ట్రైట్ మూవీ లో చేసి చాలా సంవత్సరాలే అవుతోంది.

త్రిష చివరిసారిగా నాయకి అనే బైలింగ్వల్ సినిమాతో తెలుగు తెరపై కనిపించింది. ఆ తరువాత తమిళ అనువాద చిత్రాల్లోనే తెలుగు ప్రేక్షకులు త్రిషను చూడగలిగారు. నాయకి తరువాత కొన్నాళ్ల పాటు త్రిష గడ్డు కాలాన్ని ఎదుర్కొంది అని చెప్పొచ్చు, కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఆమెకు బాగా కలిసొచ్చింది.

పీఎస్ 1 & 2 లో త్రిష తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. పైగా ఆ సినిమా మంచి పేరు తెచ్చుకోవడంతో ఆమెకు గిరాకీ పెరిగింది. దానికి తగ్గట్టు ఇళయదలతి సినిమా లియో కూడా సక్సస్ అవ్వడం త్రిష కి బాగా కలిసొచ్చింది.

వరుస హిట్లు కొట్టడం తో త్రిష కి గుడ్ టైం స్టార్ట్ అయింది దీంతో ప్రొడ్యూసర్లు ఆమెది గోల్డెన్ లెగ్ అంటూ మరలా త్రిష వెంట పడటం మొదలు పెట్టారు.

40 ఏళ్ల వయసులో త్రిష తీసుకుంటున్న పారితోషకం వివరాలు ఒక్కసారి చూద్దాం, ప్రస్తుతం తెలుగు నిర్మాతను 4 కోట్లు రెమ్యునరేషన్ అడిగి షాకిచ్చిన త్రిష తమిళ్ లో కూడా గట్టిగానే వసూలు చేస్తోంది.

సొంత రాష్ట్రం కదా అని తక్కువ రెమ్యునరేషన్ కి సినిమా ఒప్పుకోవడం లేదు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు ఉంది త్రిష యవ్వారం.

లియో సినిమా ముందు వరకు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంది త్రిష. లియోకి 5 కోట్లు తీసుకుందట. ఇప్పుడు మణిరత్నం-కమల్ హాసన్ సినిమాకి గాను ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేస్తోందట.

ఒక వేళ 12 కోట్ల రెమ్యునరేషన్ గనుక నిజమే అయితే, సౌత్ లో అత్యధికంగా పారితోషకం తీసుకున్న నాయికగానే కాక మొదటి సారి రెండు డిజిట్ల రెమ్యునరేషన్ అందుకున్న నాయికగా నిలిచిపోతుంది.

త్రిష గనుక కొండెక్కి కూర్చుని రెమ్యునరేషన్ లో దిగిరాను అంటే ఆమెను అనువాద చిత్రాల్లో చూడాలే తప్ప స్ట్రైట్ తెలుగు సినిమాల్లో చూడటం కష్టమే.

Leave a Comment