Trisha who won the age: అందం గురించి మాట్లాడాలంటే ఆవిడే..వయసును గెలిచిన త్రిష కృష్ణన్.
త్రిష కృష్ణన్ 1983 మై 4వ తేదీన పుట్టింది. ది సౌత్ క్వీన్ అని పిలవబడే ఈ తార తెలుగు మరియు తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించింది1999లో మిస్ చెన్నైగా పోటీ చేసి తన సత్తా చాటింది. మిస్ చెన్నైగా గుర్తింపు పొందాక త్రిష చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
ప్రస్తుతం 40 సంవత్సరాల వయసున్న ఈమె ఇప్పటికి 20 సంవత్సరాల అమ్మాయిలాగే కనిపిస్తుంటుంది.
అసలు వయసు ఈమెని తాకదా అనిపిస్తుంది.
మొదట ఆమె చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినపుడు జోడి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.
తర్వాత ఫల్గుణి పాఠక్ లో ఒక పాటలో కనిపించింది. అలా చిన్న చిన్న పాత్రలలో చేసిన త్రిష,
ప్రధాన పాత్రలో నటించిన సినిమా లేసా లేసా.
అయితే ఈ సినిమా విడుదలలో ఆలస్యం అవడం వాళ్ళ మౌనం పెసియాదే అనే సినిమా ద్వారా ముందుగా ప్రేక్షకులకు ప్రధాన పాత్రలో కనిపించింది.
వర్షం సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన త్రిష, తెలుగులో ఏంతో మంది స్టార్ హీరోలతో నటించింది.
నలభై ఏళ్ళ వయసున్నట్టు అస్సలు కనపడని త్రిష, ప్రస్తుతం లియో సినిమాతో ప్రేక్షకులను మరొక్కసారి పలకరించింది.
చాలా కాలం ఏ చప్పుడు లేకుండా నిశబ్దంగా ఉన్న ఈ బ్యూటీ పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరొక్కసారి దేశాన్నంతటిని తనవైపే తిప్పుకుంది.
ఇన్నేళ్లు ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందిన త్రిష, అప్పటి హీరోయిన్లకే కాదు, ఇప్పటి హీరోయిన్లకు కూడా పోటిలాగే తయారైంది.
పొన్నియన్ సెల్వన్ మొదటి పార్ట్ లో త్రిష లుక్ ని చుసిన అభిమానులు కేవలం త్రిష కోసమే 2వ పార్ట్ కోసం ఎదురుచూసారు.
పొన్నియన్ సెల్వన్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ అమ్మడు, లియో సినిమాతో అభిమానులతో మళ్లి ముచ్చటించింది. ఇపుడు వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది.
ఈ మద్యలో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అతడు సినిమాలో నటించినప్పుడు ఉన్న ఆ అల్లరి త్రిషనే ఇప్పటికి కనిపిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఈమె D50 అనే చిత్రంలో నటిస్తుంది.
D50 అనేది ధనుష్ యొక్క 50వ చిత్రం. దీనిని సన్ పిక్చర్స్ బ్యానర్ పైన కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దీనిలో త్రిషతో పాటు నిత్యామీనన్ SJ సూర్య, సందీప్ కిషన్ తదితరులు నటిస్తున్నారు.