Trisha’s review on Animal movie: యానిమల్ సినిమాకి త్రిష రివ్యూ..నువ్వేం ఫెమినిస్ట్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్.

Trisha's review of Animal movie..Trolling netizens saying you are a feminist

Trisha’s review on Animal movie: యానిమల్ సినిమాకి త్రిష రివ్యూ..నువ్వేం ఫెమినిస్ట్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్.

కోలీవుడ్ స్టార్ నటి త్రిష మరోసారి ట్రోలర్స్‎కి టార్గెట్ అయ్యింది. లేటెస్టుగా తన ఇన్‎స్టాగ్రామ్‎లో షేర్ చేసిన యానిమల్ మూవీ రివ్యూ త్రిషను చిక్కుల్లో పడేసింది.

యానిమల్ మూవీలో స్త్రీలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినా.. త్రిష మాత్రం ఈ మూవీకి కల్ట్ వావ్ అంటూ షాకింగ్ రివ్యూ ఇచ్చింది. ఈ ఒక్క పదంతో ఆమె అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

మహిళలను ఇంత దారుణంగా చూపించిన ఈ సినిమా నీకు కల్టా అంటూ త్రిషను నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. నువ్వు అసలు స్త్రీవాదివేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. స్త్రీలను అవమానించిన ఈ మూవీని పొగుడుతావా అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‎లో వచ్చిన మూవీ యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సీనియర్ నటుడు అనిల్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్యాన్ ఇండియా లెవెల్‎లో విడుదలైంది.

ప్రస్తుతం మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. సినిమా విడుదలైన ఫస్ట్ డేనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ముఖ్యంగా ఈ మూవీలో రణబీర్ యాక్టింగ్‎కు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే పొగడ్తలతో పాటు ఈ మూవీకి విమర్శలు సైతం వస్తున్నాయి.

Add a heading 2023 12 05T151538.305 Trisha's review on Animal movie: యానిమల్ సినిమాకి త్రిష రివ్యూ..నువ్వేం ఫెమినిస్ట్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్.

ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని ఫ్యామిలీతో కలిసి చూడలేమని యానిమల్ చూసిన కొంత మంది ప్రేక్షకులు సందీప్ రెడ్డిపై మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక ఇలాంటి సినిమాలో నటిస్తుందని అసలు ఊహించలేదని అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో లేటెస్టుగా త్రిష యానిమల్ మూవీపై షాకింగ్ రివ్యూ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్‎లో మూవీపై తన అభిప్రాయాలను షేర్ చేసింది. యానిమల్ మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఇది కల్ట్‌ మూవీ అంటూ క్యాప్షన్ పెట్టింది. మరి ఈ స్టోరీ చూశాక ట్రోలర్స్ ఊరుకుంటారా.

నెట్టింట్లో త్రిషను ఓ రేంజ్‎లో ఆడేసుకుంటున్నారు. ఇంత చెత్త మూవీని కల్ట్ అని ఎలా అంటారు?. త్రిష ఒక ఫేక్ ఫెమినిస్ట్ అంటూ …సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఈ పోస్ట్‎పై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ రావడంతో త్రిష అప్రమత్తమై ఈ పోస్ట్‎ను తొలగించింది.

ఈ మధ్యనే త్రిషను ఉద్దేశించి కోలీవుడ్ సీనియర్ యాక్టర్ మాన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. త్రిషకు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సపోర్ట్ చేశారు.

ఈ క్రమంలో త్రిష యానిమల్ మూవీకి పాజిటివ్ రివ్యూ అందులోనూ కల్ట్ మూవీ అని రివ్యూ ఇవ్వడంతో కొంతమంది నెటిజన్స్ షాక్ అయ్యారు. యానిమల్ సినిమా మీకు ఎలా నచ్చింది? మీరు సూక్తులు చెప్తారు.. కానీ పాటించరా అంటూ ఫైర్ అవుతున్నారు.

ఇక మరోవైపు త్రిష ఫ్యాన్స్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తోటి నటిగా త్రిష ఆ మూవీని మెచ్చుకున్నారని చెబుతున్నారు. సినిమాను, ఆర్టిస్టుల యాక్టింగ్‎ను మాత్రమే త్రిష మెచ్చుకుందని అంటున్నారు.

ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది కావాలనే త్రిషను ట్రోల్ చేస్తున్నారని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఓ సినిమా చూసిన తర్వాత తమ ఒపీనియన్ పంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని త్రిషని విమర్శించకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Comment