TS EAMCET 2024 దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది JNTUH. దరఖాస్తుదారులు TS EAMCET దరఖాస్తు ఫారమ్‌ను eamcet.tsche.ac.inలో పూరించి పంపవచ్చు. TS EAMCET దరఖాస్తు ఫారమ్ 2024 ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉందని దరఖాస్తుదారులు గమనించాలని JNTUH ఒక ప్రకటన లో కోరింది. TS EAMCET 2024 దరఖాస్తు ప్రక్రియలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అప్లికేషన్ ఫారమ్‌లను పూరించడం అలాగే కావలసిన జిరాక్స్ పత్రాలను అప్‌లోడ్ చేయడం, ఫీజు చెల్లించడం అన్ని ఉంటాయి.
TS EAMCET 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అభ్యర్థులు ఆప్షనల్ సబ్జెక్టులతో కూడిన ఇంటర్మీడియట్ పరీక్ష (12వ తరగతి) చివరి సంవత్సరం లేదా తత్సమాన పరీక్షలో తప్పని సరిగా ఉత్తీర్ణులై ఉండాలి. TS EAMCET 2024 దరఖాస్తులు పంపుటకు చివరి తేదీ ఏప్రిల్ 6, 2024. అయితే లేట్ ఫి తో TS EAMCET 2024 దరఖాస్తు తేదీ ఫైన్ ప్రకారం మారుతూ ఉంటుందని విద్యార్ధులు గమనించాలి.
రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత JNTUH TS EAMCET 2024 దరఖాస్తు ఫారమ్ కరెక్షన్ చెయ్యడం ప్రారంభిస్తుంది. TS EAMCET అప్లికేషన్ ఫారమ్‌ను పూరించే సమయంలో ఏదైనా పొరపాటు చేసినట్లయితే అప్లికేషన్ పంపిన విద్యార్ధులు కరెక్షన్ సౌకర్యం ద్వారా సవరణలు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, దరఖాస్తు దారులు భవిష్యత్ సూచనల కోసం TS EAMCET దరఖాస్తు ఫారమ్ 2024 PDFని మీ వద్ద ఉంచుకోవాలని EAMCET అధికారులు చెప్తున్నారు . TS EAMCET దరఖాస్తు రేటు 2024 కమ్యునిటీ ఆధారం గా మారుతుంది. అభ్యర్థులు EAMCET దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా చెల్లించవచ్చు.