TS High Court allotted 100acres: 100 ఎకరాల్లో తెలంగాణ నూతన హైకోర్టు.

New High Court of Telangana in 100 acres.

TS High Court allotted 100acres: తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కొలువు దీరిన వెంటనే పాలనాపరమైన అడుగులు వడివడిగా పడుతున్నాయి.

పనితనంలో తనదైన మార్కు చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటు వాటిని వడివడిగా అమలు చేస్తోంది.

ఆ ప్రణాళికలు కార్యరూపందాల్చడం కోసం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. అటువంటి నిర్ణయమే తెలంగాణ రాష్ట్ర హై కోర్టు(Telangana Hicourt) విషయంలో తీసుకున్నారు.

100 ఎకరాలు ఎక్కడివంటే : From Where 100 acres Allotted

తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్తాన భవనాలను నిర్మించేందుకు తెలంగాణ సర్కారు అనుమతులు మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) రాజేంద్రనగర్‌ మండలం

ప్రేమావతిపేట(Premavathipeta), బుద్వేలు(Budvel Village) గ్రామాల్లో గల ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ(Jayasankar Telangana Agricultural University),

కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీలకు(Konda Lakshman Bapuji Telangana Horticultural University)

చెందిన 100 ఎకరాల భూమిని ఉన్నత న్యాయస్థాన నిర్మాణానికి కేటాయించింది. ఈమేరకు జనవరి 5వ తేదీన జీవోను కూడా రేవంత్ రెడ్డి సర్కారు విడుదల చేసింది.

ప్రధాన న్యాయ మూర్తి తో భేటీ అయ్యాకే : After meeting the Chief Justice

1966లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్వేలులోని 2,533 ఎకరాల భూమిని వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీలకు కేటాయించింది.

అప్పట్లో చెన్నారెడ్డి(Marri Chenna Reddy) కేటాయించిన ఆభూమిలో రాష్ట్ర హై కోర్టు(Hi court) నిర్మాణం కోసం 100 ఎకరాలను ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) అనుమతులను జారీ చేశారు.

తెలంగాణ ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన కొత్తలోనే రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్‌ అరాధేతో (Justice Alok Aaradhe) రేవంత్ భేటీ అయ్యారు.

750x450 482670 justice alok aradhe TS High Court allotted 100acres: 100 ఎకరాల్లో తెలంగాణ నూతన హైకోర్టు.

వారు ఇరువురు నూతన భవన నిర్మాణ ప్రతిపాదనలు, 100 ఎకరాల భూమి కేటాయింపు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు(Sridhar Babu),

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) న్యాయమూర్తులతో కలిసి బుద్వేలులో పర్యటించి భూములను పరిశీలించారు.

హైకోర్టు భావన నిర్మాణానికి ఆ భుములు యోగ్యంగానే ఉన్నాయని నివేదికను అందించారు. రెవెన్యూ శాఖ అధికారులు విశ్వవిద్యాలయాలకు లేఖ రాయడం,

వారు అంగీకరించడం అన్ని కూడా వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో ప్రేమావతిపేటలో 95 ఎకరాల 18 గుంటలు, బుద్వేలులో 4 ఎకరాల 22 గుంటల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.

Leave a Comment