TSRTC Graduate Apprentice Posts notification: నిరుద్యోగ యువతకు ఇది నిజంగా శుభవార్త, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లలోఉన్న నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయదలిచింది.
ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ దఫా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయదానికి ప్లాన్ చేశారు.
దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంటే బీఏ(BA), బీకాం(B.com), బీబీఏ(BBA), బీసీఏ(BCA) వంటి డిగ్రీలు.
ఈ తరహా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు గా పరిగణించబడతారు. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తారు.
ఈ 150 ఖాళీల్లో 25 శాతం బీసీలకు కేటాయించగా. ఎస్సీలకు 1:16 నిష్పత్తిలో, ఎస్టీలకు 1:16 నిష్పత్తిలో కేటాయించడమైనట్టు తెలుస్తోంది.
ఈ ఖాళీలను రిలిజియన్ల వారీగా చూస్తే,
- హైదరాబాద్ రీజియన్: 26
- సికింద్రాబాద్ రీజియన్: 18
- మహబూబ్నగర్ రీజియన్: 14
- మెదక్ రీజియన్: 12
- నల్గొండ రీజియన్: 12
- రంగారెడ్డి రీజియన్: 12
- ఆదిలాబాద్ రీజియన్: 09
- కరీంనగర్ రీజియన్: 15
- ఖమ్మం రీజియన్: 09
- నిజామాబాద్ రీజియన్: 09
- వరంగల్ రీజియన్: 14 ఉన్నాయి.
TSRTC Graduate Apprentice Posts notification
2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యాసంవత్సరంలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక దరఖాస్తు దారుల వయోపరిమితి చూస్తే 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. NATS అనే అప్రెంటిస్ వెబ్సైట్ లో అభ్యర్థులు తమతమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేయబడ్డవారికి మొదటి మూడు సంవత్సరాల స్టైఫండ్ ఎలా ఉంటుందంటే మొదటి సంవత్సరం 15 వేలు, రెండవ సంవత్సరం 16 వేలు, మూడవ సంవత్సరం 17 వేలు ఉంటుంది. ఆశక్తి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.