TSRTC Shoking Decision: మహిళలకు జీరో టికెట్ తప్పనిసరి Zero ticket is mandatory for women
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telanagana Government) అధికారం చేపట్టిన 100 రోజుల్లోగా ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రచించుకుంటోంది.
ఈ క్రమంలోనే మొట్టమొదటగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అనే దానిని అమలు చేసింది. ఈ పధకం రేవంత్ రెడ్డి సీఎం (CM Revanth Reddy) గా పగ్గాలు చేపట్టిన రెండు మూడు రోజుల్లోనే అమలు చేశారు.
అయితే ఉచిత బస్సు ప్రయాణం అనగానే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా బస్సు రాష్ట్ర పరిధిలో ఎక్కి ఎక్కడికైనా వెళ్లొచ్చు, కానీ దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
వాటిని తప్పక ఫాలో అయ్యి తీరాల్సిందే. చార్జీలు లేకుండా ఫ్రీ ప్రయాణం అంటే టికెట్ లేకుండా ప్రయాణించడం కాదని అంటోంది, తెలంగాణ ఆర్టీసీ,
అయితే టికెట్ తీసుకోవాలని నిబంధనలు పెట్టడానికి కారణం కూడా ఉందని చెబుతోంది. పైగా జీరో టికెట్ లేకుండా మహిళలు గనుక ప్రయాణం చేస్తే ఐదు వందల రూపాయల వరకు జరిమానా విధిస్తారని చెబుతోంది.
ఎందుకు ఫైన్ వేస్తారంటే.. Reason Behind Penalty
అసలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇలా ఎదో ఒక మెలిక పెట్టడం ఏమిటా అని చాల మందికి ఆశ్చర్యం గా అనిపించవచ్చు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023
అయితే ఈ నిబంధన విధించడం పై కారణాలను కూడా చెబుతున్నారు టి.ఎస్.ఆర్.టి.సి ఎండి(TSRTC MD) సజ్జనార్ (Sajjanar),
అయన చెబుతున్నదేమిటంటే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నది నూటికి నూరు శతం నిజం, అయితే జీరో టికెట్ మాత్రం కంపల్సరీగా తీసుకుని తీరాల్సిందే అంటున్నారు.
అలా జీరో టికెట్ తీసుకోవడం వల్ల ఎంత మంది ప్రయాణించారో, ఎక్కడి నండి ఎక్కడికి ఉచిత ప్రయాణం జరిగిందో అన్న విషయాలను లెక్కించి
ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కి రీఎంబర్స్ చేస్తుందని చెబుతున్నారు. అందుకే జీరో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారు సంస్థకి నష్టం చేకూర్చిన వారవుతారని చెబుతున్నారు.
ఐడి ప్రూఫ్ లేకుంటే టికెట్ కొనాల్సిందే : If you don’t have ID proof, you have to buy a ticket
కేవలం టికెట్ తీసుకోవడం విషయంలోనే కాదు, ఆర్టీసీ లో మహిళలు ఉచిత టికెట్ సౌలభ్యాన్ని పొందాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు చూపించాల్సిందే.
ఎందుకంటే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం తెలంగాణ ఆడపడుచులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల ఆడ వారు ఈ ఉచిత ప్రయాణానికి అర్హులు కారు. అందుకే తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించి మరీ జీరో టికెట్ పొందాల్సి ఉంటుంది.