తిరుమల తిరుపతి దేవస్థానం(Titumala Tirupati Devasthanam) ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(TTD Chairmen Bhumana karunakar Reddy) మాట్లాడుతూ, శ్రీవారి భక్తులకు బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీకాసులను విక్రయించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ధర్మప్రచారంలో భాగంగానే బంగారు మంగళసూత్రాలను తయారు చేసి, వాటిని వెంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆతరువాత భక్తులకు విక్రయించనున్నట్టు పేర్కొన్నారు.
గతంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపి మంగళసూత్రాలు అందించామని చెప్పారు, ఆ వివాహాలు చేసుకున్న వారిలో ఏ ఒక్కరూ కూడా మతం మారలేదని అన్నారు, మత మార్పిళ్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కరుణాకర్ రెడ్డి చెప్పారు.
5 గ్రాములు, అలాగే 10 గ్రాముల బరువుతో మంగళ సూత్రాలు ఉంటాయని, అలాగే నాలుగైదు డిజైన్లలో బంగారు మంగళసూత్రాలను తయారు చేసి విక్రయిస్తామని అన్నారు. ఇక ఈ మంగళసూత్రాలు లక్ష్మి కాసు లో టీటీడీ కి ఎటువంటి లాభాపేక్ష లేదని చెప్పారు.
కొత్త నిర్మాణాలు – పేరు మార్పులు : New contructions – name changes
ధర్మకర్తల మండలి సమావేశంలో భాగంగా ప్రవేశ పెట్టిన 5,141.74 కోట్ల రూపాయాల అంచనాతో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌కు టీటీడీ(TTD) ఆమోద ముద్ర వేసింది. తిరుపతి లోని శ్రీపద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీపద్మావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌గా(Padmavati Institute of Child Health) పేరు మార్చే నిర్ణయానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
ప్రస్తుతం ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు రెండు వరుసల రహదారి ఉందని, దానిని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు, దీనికోసం 30.71 కోట్ల రూపాయలతో టెండరుకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానిక ఆలయాలు, అలాగే టీటీడీలో విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో నూతన పోస్టుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదన పంపనున్నట్టు చెప్పారు.