December 5, Horoscope: మంగళవారం రాశిఫలాలు..ఈ రాశుల వారికి నూతన ఉద్యోగావకాశాలున్నాయి

Tuesday Horoscopes.. There are new job opportunities for these zodiac signs

December 5, Horoscope: మంగళవారం రాశిఫలాలు..ఈ రాశుల వారికి నూతన ఉద్యోగావకాశాలున్నాయి.

మేషరాశి:

ఈరోజు మేషరాశివారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.

మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పేరుప్రతిష్టతలు కలుగుతాయి. విలువైన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

వృషభ రాశి:

ఈరోజు ఈ రాశివారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

అయినప్పటికీ అవి ఓ కొలిక్కి వస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

మిధున రాశి:

మిథునరాశి వారికి ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఓం నమ: శివాయ మంత్రం జపించడం మంచిది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభిస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి.

సింహ రాశి:

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగంలో అంత అనుకూలంగా ఉండదు. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి.

కన్య రాశి:

Add a heading 2023 12 05T132538.257 1 December 5, Horoscope: మంగళవారం రాశిఫలాలు..ఈ రాశుల వారికి నూతన ఉద్యోగావకాశాలున్నాయి

వీరికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

తుల రాశి:

తులరాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడం అవసరం. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. వృధా ఖర్చులు చేయకూడదు. కుటుంబసభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి.

వృశ్చిక రాశి:

ఈరోజు ఈరాశి వారికి బాగుంది. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు రాశి:

ధనస్సురాశి వారు తమ చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు.

వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు ప్రతిష్టతలు కలుగుతాయి. దైవానుగ్రహం ఉంటుంది.

మకర రాశి:

ఈరోజు ఈరాశి వారికి ఆశించినంత ఆశాజనకంగా లేదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. అప్పులు చేయాల్సి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి..

దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేస్తారు.

కుంభ రాశి:

Add a heading 2023 12 05T132749.317 1 December 5, Horoscope: మంగళవారం రాశిఫలాలు..ఈ రాశుల వారికి నూతన ఉద్యోగావకాశాలున్నాయి

వీరికి ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. రుణం కోసం ప్రయత్నం చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశాలున్నాయి. పనులు మందకొండిగా సాగుతాయి..

అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం చెప్పదగిన సూచన.

మీన రాశి:

మీనరాశివారికి ఇవాళ బాగుంది. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

నూతన వాహనయోగం ఉంది. ఉద్యోగయత్నాలు సజావుగా సాగుతాయి. రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

Leave a Comment