పేదల కోసం రెండు కోట్ల ఇళ్లు నిర్మలా సీతారామన్ : Two crore houses for the poor – Nirmala Seetaraman

website 6tvnews template 2024 02 01T152954.278 పేదల కోసం రెండు కోట్ల ఇళ్లు నిర్మలా సీతారామన్ : Two crore houses for the poor - Nirmala Seetaraman

Two crore houses for the poor – Nirmala Seetaraman : దేశ ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్(Nirmala Seetaraman) పార్లమెంట్ లో బడ్జెట్(Budget Session In Parliament) ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ లో పేద వారికి ఎటువంటి ఫలాలను సంక్షేమ పధకాల ద్వారా అందించబోతోందా అని ఆరుతగా ఎదురుచూసింది దేశం.

అయితే ఆ ఎదురుచూపులు వృధా కాలేదు, రాబోయే ఐదేళ్ళలో దేశ వ్యాప్తంగా ఉన్న పేద వారికి, అలాగే అద్దె ఇళ్లలో ఉంటున్న దిగువ మధ్యతరగతి వారి కోసం రెండు కోట్ల ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పారు. ఈ వార్త ప్రస్తుత తరుణంలో హాట్ టాపిక్ గా మారింది.

దీనిపై పేద వర్గాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.(Two crore houses for the poor) సొంత ఇళ్లు లేకపోవడం వల్ల దేశంలోని అనేకమునది పేద వర్గాల ప్రజలు సంపాదించిన సొమ్ములో దాదాపు సగం భాగం ఇంటి అద్దె చెల్లించడానికి వెచ్చిస్తున్నారు.

దీంతో ఈ వార్త వారికి చాలా ఊరట కలిగించింది. ఈ ఇళ్లు కేవలం గ్రామాల ప్రజలకు మాత్రమే కాక పట్టణాల్లోని ప్రజలకు కూడా కట్టించి ఇవ్వబడుతుందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రాల సహకారం కూడా అవసరమే : Cooperation of states is also necessary

పేదల కోసం రెండు కోట్ల ఇళ్లు న్నిర్మలా సీతారామన్

అయితే ఈ ఇల్లు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నిర్మించాలంటే తప్పక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం ఉంది తీరాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన(PM Awas Yojana) పధకం కింద ఈ ఇళ్ల నిర్మాణం ఉంటుందని చెప్పారు.

పేద ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.(Two crore houses for the poor) పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఎంత పెద్ద మొత్తంలో అయినా నిధులు ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. దీనికోసం ప్రణాలికా బద్దంగా ముదుకువెళ్లనున్నట్టు చెప్పారు.

Leave a Comment