Udayanidhi Stalin Targeted Ayodhya Rama Temple: రామ మందిరాన్ని టార్గెట్ చేసిన ఉదయనిధి – ఎంతమాటన్నాడో తెలుసా ?

website 6tvnews template 49 Udayanidhi Stalin Targeted Ayodhya Rama Temple: రామ మందిరాన్ని టార్గెట్ చేసిన ఉదయనిధి - ఎంతమాటన్నాడో తెలుసా ?

హిందూ సనాతన ధర్మాన్ని(Sanathana Dharma) డెంగ్యూ, మలేరియాతో పోల్చి గతంలో వివాదానికి తెరతీసిన నటుడు, రాజకీయ నేత ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) ఇప్పుడు మరోసారి సెన్సేషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

అయితే ఈ సారి అయన అయోధ్య రామ మందిరాన్ని టార్గెట్ గా చేసుకుని మాట్లాడినట్టు తెలుస్తోంది. కేవలం కొద్దీ రోజుల్లో రామమందిరం ప్రారంభం కానున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సెన్సేషన్ గా మారాయి.

ముగిసిపోయింది అనుకున్న అంశాన్ని ఉదయనిధి మరోమారు వెలికితీసే ప్రయత్నం చేశారు. రామమందిరంపై డీఎంకే పార్టీ(DMK) వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయోధ్య(Ayodhya)లో రామమందిర నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. కానీ మసీదు పడగొట్టి మందిరం నిర్మించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

డీఎంకే పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ కరుణానిధి(karunanidhi) బ్రతికి ఉన్నా కూడా అయన ఇదే విషయం చెప్పేవారని అన్నారు. ఆధాత్మికతను రాజకీయాలతో ముడిపెట్టడం సరైన పద్దతి కాదని హితవుపలికారు. మసీదును ధ్వంశం చేసి రామ మందిరాన్ని నిర్మించి ఉండాల్సింది కాదన్నారు.

గతంలో ఏమన్నాడంటే ? Previous Comments ?

ఇక గతంలో చుస్తే సనాతన ధర్మం పై ఉదయనిధి చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు. సనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగ్యూ వంటి వాటి మాదిగా పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే జనవరి 22వ తేదీన ప్రధాని మోదీ(PM Narendra Modi) చేతుల మీదుగా రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ విశిష్టమైన కార్యక్రమానికి రాజకీయ సినిమా ప్రముఖులను ఆహ్వానించగా, సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), లాలూ ప్రసాద్ యాదవ్(lalu Prasad Yadav), శరద్ పవార్(Sarad Pavar) వంటి నేతలు ఈ కార్యక్రమానికి తాము రాబోవడం లేదని చెప్పేశారు.

Leave a Comment