UK PM Rishi Sunak sacks Suella Braverman : రిషి సునాక్ సుయెల్లా బ్రవర్ మన్ ను తప్పించింది ఎందుకంటే..

Add a heading 12 UK PM Rishi Sunak sacks Suella Braverman : రిషి సునాక్ సుయెల్లా బ్రవర్ మన్ ను తప్పించింది ఎందుకంటే..

UK PM Rishi Sunak sacks Suella Braverman : రిషి సునాక్ సుయెల్లా బ్రవర్ మన్ ను తప్పించింది ఎందుకంటే..సుయెల్లా బ్రిటన్ లోని పాకిస్తానీ పురుషులపై చేసిన వ్యాఖ్యలు..

భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు, అయితే రిషి సునాక్ క్యాబినెట్ లో మరో భారత సంతతి కి చెందిన వ్యక్తి ఉన్నారు. తాను మరెవరో కాదు ఇప్పటివరకు కూడా ఆదేశ హోమ్ మంత్రి, రిషి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సుయెల్లా బ్రెవర్మన్‌ అని ఎందుకు నొక్కి వక్కాణించాల్సి వచ్చింది అంటే ఆమెను ప్రధాని రిషి హోమ్ మంత్రి పదవి నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సుయెల్లా కి రిషి ఉద్వాసన పలకడం సంచలనంగా మారినప్పటికీ దాని వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. ఆమె స్థానంలో మరో మహిళను హోమ్ మంత్రిగా రిషి సునాక్ నియమించారు. అయితే భారత సంతతికి చెందిన
సుయెల్లా ను తప్పించడంపై కారణాలు తెలుసుకునేందుకు చాల మంది ఆశక్తి కనబరుస్తున్నారు. అందులో భారతీయులే ఎక్కువ ఉండటం విశేషం.

ఇక సుయెల్లా హోమ్ మంత్రి పదవిని చేజార్చుకోవడానికి కారణాలను అంతకు ముందు చోటుచేసుకున్న పరిణామాలను ఒక్క సారి చూద్దాం. గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ లండన్ వీధుల్లో పాలస్తీనా మద్దతుదారులు ర్యాలీని నిర్వహించారు. కాగా ఈ ర్యాలీని కట్టడి చేయడంలో పోలీసులు విఫలం కావడంపై సుయెల్లా బ్రెవర్మన్‌ గట్టిగానే రియాక్ట్ అయ్యారు.

పోలీసులపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని కనబరిచారు. ఆందోళనకారులు, రిషి సునాక్ ను ధిక్కరిస్తున్నప్పటికీ పోలీసులు వారిపట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది సుయెల్లా. పైగా లండన్ వీధుల్లోకి మితవాదులు వచ్చేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ విశ్లేషకులు, విమర్శకులు ఆమె తీరుపై మండిపడ్డారు. దీంతో ప్రధాని రిషి సునాక్ ఆమె పై చర్యలు తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.

కేవలం రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా సుయెల్లా వార్తల్లోకి ఎక్కారు. గతంలో రాష్ డ్రైవింగ్ వివాదంలో కూడా చిక్కుకున్నారు. సామాన్య పౌరురాలు గా ఉన్నప్పుడు ఫైన్ పడటం వేరు, అటార్నీ జనరల్ గా ఉన్న సమయంలో ఆమెకు రాష్ డ్రైవింగ్ కారణంగా ఫైన్ పడటం వేరు. దీంతో ఆమె తన కు ఫైన్‌ పడిన విషయాన్నీ ఆ ఫైన్ తాలూకు పాయింట్లను దాచిపెట్టేందుకు ప్రయతించారని కొందరు ఆరోపిస్తున్నారు.

ఈ రాష్ డ్రైవింగ్ విషయంలో ఆమె పేరు బయటకు పొక్కకుండా ఉండేందుకు రాజకీయ సాయం కోరినట్టు ప్రతిపక్షాలు ఆరొపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు బ్రిటన్‌లో పాక్ సంతతి వ్యక్తులపై కూడా ఆమె నోరుపారేసుకున్నారు.

బ్రిటన్ లో ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన పురుషులు, బ్రిటన్ అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వివాదాస్పద ఆరోపణలు ప్రతిపక్షానికి చేజేతులా ఛాన్స్ ఇచ్చినట్లయింది.

Leave a Comment