Devil Movie Collections: అభిషేక్ నామా ( Abhishek Nama) దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram ) నటించిన ‘డెవిల్’ (Devil ) మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం రిలీజైంది.]
బింబిసార(Bimbisara ) మూవీ సూపర్ డూపర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తుందని ఆశపడ్డారు.
కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా డిజాస్టర్ అయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కాస్త పరవాలేదనిపించినప్పటికీ
మూడు రోజుల కలెక్షన్లు చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఓవైపు వీకెండ్ మరోవైపు ఇయర్ ఎండ్ అయినప్పటికీ కూడా కలెక్షన్ల విషయంలో పెద్దగా ఆశాజనకంగా అనిపించలేదు.
Devil 3 day Collections: డెవిల్ మూడు రోజుల collections
డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చాలా వరకు సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇదే క్రమంలో ఈ కొత్త సంవత్సరంలో థియేటర్లలో సందడి చేసేందుకు డెవిల్(Devil ) సినిమా వచ్చింది.
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram ), సంయుక్త మీనన్ (Samyuktha Menon ) కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. అయితే అంచనాలకు తగ్గట్లుగా ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతం కాలేదని తెలుస్తోంది. కలెక్షన్ల పరంగా డెవిల్ వెనుకబడే ఉందని నిపుణులు చెప్తున్నారు.
Amazing pre-release collections : ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దూకుడు
‘డెవిల్’(Devil )సినిమా రిలీజ్ ముందే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు మేకర్స్. బ్రిటిష్ కాలంలో ఒక స్పైకు సంబంధించిన కథ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విజువల్ వండర్ అని ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారు.
కళ్యాణ్ రామ్ కూడా తనదైన స్టైల్ లో బుల్లితెర లో మూవీకి ప్రమోషన్స్ చేశారు. దీంతో ప్రీ బుకింగ్స్ విషయంలో దూకుడు చూపించింది డెవిల్ మూవీ . ప్రీ బుకింగ్స్ లోనే నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ.
3 కోట్లు, ఆంధ్రాలో దాదాపు రూ. 8 కోట్లు వసూలయ్యాయి. తెలంగాణ( Telangana ), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh )లో డెవిల్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.16.50 కోట్లు అయ్యింది.
ఓవర్సీస్‌లో రూ.2 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.1.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వగా.. మొత్తం ‘డెవిల్’ ప్రీ రిలీజ్ వ్యాపారం రూ.20.10 కోట్ల మార్క్ కు చేరుకుంది.
Is Devil disaster : డెవిల్ మూవీ డిజాస్టరా?
కొత్త సంవత్సరం అందులోనూ వీకెండ్ అవడంతో చాలామంది సినిమా థియేటర్లో మూవీని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు.
ఈ విషయం తెలుసుకునే డెవిల్ మూవీని మేకర్స్ వీకెండ్ లో సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా పబ్లిక్ పల్స్ ను పట్టుకోలేకపోయింది.
దీంతో చాలామంది ఈ మధ్యనే విడుదలైన సలార్ మూవీకి వెళ్లడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనితో ‘డెవిల్’ కలెక్షన్స్‌కు పెద్ద గండి పడినట్లయింది.
ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాక రూ.1 కోటి కలెక్షన్స్ మాత్రమే రాబట్టిందని టాక్ . ఇక వరల్డ్ వైడ్ గా కేవలం రూ.1.30 కోట్లను మాత్రమే వసూలు చేసిందని సమాచారం . దీనితో ‘డెవిల్’ పెద్ద డిజాస్టర్ అని తెలుస్తోంది.