Union Minister Kishan Reddy’s sensational comments on phone tapping! : ఫోన్ ట్యాపింగ్ అనేది భారత దేశ చరిత్ర లో చాలా తీవ్రమైన అంశమని మామూలు ఆషామాషీ కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారని అంతే కాకుండా ఎంక్వయిరీ లో చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని ఆయన ఆన్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెద్ద మొత్తం లో డబ్బులు కూడా వసూలు చేసారని ఇప్పటివరకు అందుతున్న వార్తల ద్వారా తెలుస్తోంది అన్నారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్చను హరించివేశారని ఆయన దుయ్యబట్టారు.
భారత దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించారని, అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఫోన్ టాపింగ్ లో KCR తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కుడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తప్పకుండా బయట పడుతుందన్నారు.
అంతేకాదు ఇది ఆషామాషీ కేసు కాదు కాని ఇది తప్కప కక్షసాధింపు చర్య అవుతుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ పై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని తెలిపారు ఆయన డిమాండ్ చేసారు.