సోనూసూద్‌కు అభిమాని స్వీట్ సర్‌ప్రైజ్‌

website 6tvnews template 96 సోనూసూద్‌కు అభిమాని స్వీట్ సర్‌ప్రైజ్‌

Unknown fan gave a sweet surprise to Sonusood : సినిమాల్లో సోనూసూద్ (Sonu Sood) విలన్ పాత్రను పోషించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరోనే. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఎందరో నిస్సాహాయులకి సహాయం అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ప్రత్యేక బస్సులు, చార్టర్డ్ ఫ్లైట్‌లను బుక్ చేసి మరీ వేలాది మంది వలస కార్మికులకు వారి ఇళ్లకు చేరుకోవడానికి సోనూ సూద్ సహాయం చేశారు.

అనేక సేవ కార్యక్రమాలతో భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి సోను సూద్ సహాయం చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన సహాయం కోసం అడిగేవారు ఎంతో మంది ఉన్నారు. ఇంతటి గొప్ప హృదయం ఉన్న సోను సూదుకు అభిమానుల సంఖ్య ఎక్కువే. అందుకే ఓ అభిమాని తన అభిమాన నటుడి కోసం ఓ సప్రైజ్ ప్లాన్ చేశాడు. సోను సూద్ మనసు గెలుచుకున్నాడు.

సినిమా హీరోలకు ఉండే క్రేజే వేరు. ఒక్కో హీరోకు ఒక్కో రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన తారల సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. హీరోలకే కాదు విలన్ లకు కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందని నిరూపించారు సోను. తన సామాజిక కార్యక్రమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటి హీరో కోసం ఏమైనా చేయాలని ప్రతి ఫ్యాన్ ఫీల్ అవుతూ ఉంటాడు.

ఆ ఛాన్స్ వచ్చిన ఒక ఫ్యాన్ తన లవ్ ని చాలా లవ్లీ గా చూపించాడు. సోనూసూద్‌ (Sonu Sood) కు ఓ అజ్ఞాత అభిమాని స్వీట్ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు . రీసెంట్ గా ముంబైలోని ఒక రెస్టారెంట్‌ లో ఫ్యామిలీ తో కలిసి సోను డిన్నర్ కి వెళ్లాడు. డిన్నర్ కంప్లీట్ అయినా బిల్‌ కోసం ఎవరూ రాలేదు. దీంతో సోనూసూద్‌ సిబ్బంది దగ్గరికి వెళ్లి బిల్లు ఎంత అని అడిగాడు.

దీంతో తన ఫుడ్‌ బిల్లు మొత్తం ఎవరో అజ్ఞాతవాసి చెల్లించాడని సోనూసూద్ కి చెప్చెప్పడంతో సోనూసూద్, అతని ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అంతేకాదు ఆ అభిమాని ఒక నోట్ కూడా సోనూసూద్ కోసం రాశాడు.

” దేశం కోసం మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. నా నుంచి మీకు చిన్న కృతజ్ఞత ఇది’ అని ఓ చిన్న పేపర్ ముక్కపై రాసి ఉంచాడు. ఈ విషయాన్ని సోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. “మా డిన్నర్‌ బిల్లు మొత్తం కట్టేసి ఈ నోట్‌ రాసి వెళ్లారు. అతను ఎవరో నాకు తెలియదు. కానీ అతడు నా హృదయాన్ని గెలుచుకున్నాడు” అని సోను పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Comment