Upcoming Movies Release Date List: త్వరలో విడుదల కానున్న కొత్త సినిమాలు ఇవే

website 6tvnews template 32 Upcoming Movies Release Date List: త్వరలో విడుదల కానున్న కొత్త సినిమాలు ఇవే

సంక్రాంతి పండుగ వేళ కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో వాతావరణం సందడిగా మారింది. ఫిల్మ్ మేకర్స్‌ సినీ లవర్స్‌కి అదిరిపోయే అప్‌డేట్స్‌ ఇచ్చారు. తమ అభిమాన తారల సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న సినిమాల రిలీజ్‌ డేట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

New release date of Captain Miller : కెప్టెన్ మిల్లర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

తమిళ సూపర్ స్టార్ ధనుష్ (Danush)హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ కెప్టెన్ మిల్లర్ (Captain Miller).

డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran) తీసిన ఈ మూవీ తెలుగు వెర్షన్ మినహా అన్ని భాషలలో రిలీజ్ అయ్యింది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Asian Multiplex Private Limited), సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions)ఈ మూవీ తెలుగు రైట్స్ ను దక్కించుకుంది.

Upcoming Movies Release Date List

జనవరి 25న తెలంగాణ, ఏపీలో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ విపరీతమైన బజ్ ని క్రియేట్ చేసింది.

ఈ మధ్యనే రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీలో ధనుష్ కి జోడీగా ప్రియాంక మోహన్ (Priyanka MOhan)కనిపించనుంది.

Comedy drama Ambajipeta Marriage Band: కామెడీ డ్రామా అంబాజీపేట మ్యారేజి బ్యాండు

కామెడీ డ్రామాతో సుహాస్ (Suhas)హీరోగా వస్తున్న మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band).ఈ మూవీ ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్లు అనౌన్స్ చేశారు.

యూనిక్ స్టోరీతో , స్క్రీన్ ప్లేతో విడుదల కానున్న ఈ మూవీ మూవీ థియేటర్స్ లో ప్రేక్షకులను సరికొత్త అనుభూతి కలిగిస్తుందని మూవీ యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో సుహాస్ కు జోడీగా శివాని నాగరం (Shivani nagaram) కనింపించనుంది.

Raviteja Eagle New release date: ఈగల్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే

మాస్ మహారాజ్ రవితేజ (Raviteja)హీరోగా లేటెస్టుగా నటించిన మూవీ ‘ఈగల్‌’ (Eagle). కార్తిక్‌ ఘట్టమనేని ( karthik ghattamaneni)డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో బాగా అప్సెట్ అయ్యారు.

Upcoming Movies Release Date List

ముందుగా అనుకున్న తేదీకి ఈ మూవీని విడుదల చేయలేకపోతున్నామని మేకర్స్ ఈ మధ్యనే అనౌన్స్ కూడా చేశారు. ఈ క్రమంలో కొత్త రిలీజ్ డేట్ ను కూడా తాజాగా చిత్రబృందం ఓ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేసింది.

ఈగల్ (Eagle) సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. అయితే ఇప్పటికే మరో రెండు సినిమాలు ఆ విడుదల తేదీని ప్రకటించాయి. ఆ రెండు సినిమాల నిర్మాతలతో కూడా ప్రొడ్యూజర్ల టీమ్ చర్చలు జరిపింది. వాళ్లని ఒప్పించి.. ఫిబ్రవరి 9న ఈగల్ వచ్చేలాగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

OOri Peru Bhairavakona : ఊరు పేరు భైరవకోన

సందీప్ కిషన్ (Sandeep Kishan)హీరోగా వీఐ ఆనంద్ (Anand)డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఊరు పేరు భైరవకోన(OOri Peru Bhairavakona ).

ఈ సినిమా షూటింగ్ పూర్తైనా ఇప్పటివరకు దీని రిలీల్ కు ముహూర్తం ఫైనల్ కాలేదు. అంతే కాదు పోస్ట్ ప్రొడక్షన్‌ పనులకు చాలా టైం తీసుకున్నారు. ఇదే క్రమంలో ప్రేక్షకుల్లో హైప్ పెంచేందుకు రీసెంట్ గా సిడ్ శ్రీరామ్ పాడిన పాటను విడుదల చేశారు.

ఈ పాట మంచి ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ మూవీని ఈగల్ కు పోటీగా ఫిబ్రవరీ 9న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని హీరో సందీప్ కిషన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశాడు. ఊరు పేరు భైరవకోన లో సందీప్ కు జోడీగా వర్ష బొల్లామా (Vasrsha Bollama), కావ్యా థాపర్ (Kavya Thapur) నటిస్తున్నారు.

Varun Tej Operation Valentine Released Date : వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్‌ ఎప్పుడంటే?

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ (Varun Tej) ఈ మధ్య నటించిన గాండీవధారి అర్జున (Ghandivadhara Arjuna)మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం మెగా ప్రిన్స్ తెలుగు–హిందీ బై లింగువల్ వెంచర్ ఆపరేషన్ వాలెంటైన్‌ (Operation Valentine)తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు వరుణ్. ఫిబ్రవరి 16న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ (Manushi Chiller)హీరోయిన్ గా కనిపించనుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakthi Pratap Sing Hada) ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇక సినిమా ప్రమోషన్ లలో భాగంగా మొదటి సింగిల్ ను జనవరి 17 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

భారతదేశంలోని అమృత్‌సర్‌లోని(Amrutsar) ఐకానిక్ వాఘా బార్డర్స్ (wagah Borders) లో ఈ పాటను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Vikram Thangalan Released in April : ఏప్రిల్‎లో విక్రమ్ తంగలాన్‌

Upcoming Movies Release Date List

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ (Vikram) హీరోగా రాబోతున్న మూవీ ‘తంగలాన్‌’ (Thangalaan) రిలీజ్ ఈమధ్యే వాయిదా పడింది. దీంతో మేకర్స్ తాజాగా ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ముందుగా అ సినిమాను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

అయితే ఆ నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేసుకున్నారో కారణాలను మాత్రం తెలపలేదు. అయితే ఏప్రిల్‌లో ఏ రోజున తంగలాన్ రిలీజ్ ఉంటుందో కూడా క్లారిటీ ఇవ్వలేదు. కర్ణాటక (Karnatana)లోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (Kolar Gold Fields) కార్మికుల జీవితాల ఆధారంగాప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియన్ మూవీగా డైరెక్టర్ పా. రంజిత్‌ (Ranjith) తెరకెక్కిస్తున్నారు.

మాళవిక మోహనన్‌ (Malavika Mohanan), పార్వతి తిరువోతు (Parvathi Thiruvothu) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Comment