Telangana New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్.. ఈ 28 నెల నుంచి దరఖాస్తుల స్వీకరణ!

Update on the issuance of new ration cards.. Acceptance of applications from this 28th month!

Telangana New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్.. ఈ 28 నెల నుంచి దరఖాస్తుల స్వీకరణ!

తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ (Congress)ప్రభుత్వం రేషన్ కార్డుల(Ration Cards) విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా(State Wide) కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది.

అయితే ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల(Aplications) స్వీకరణకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసేసింది రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్.

ఇక రేషన్ కార్డుల(Ration Cards) విషయం లో నిజమైన అర్హుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో కార్యచరణ జరిపేందుకు పక్కా ప్రణాలికను సిద్ధం చేసే పనిలో తలమునకలై ఉన్నారు అధికారులు(Officers).

అర్హులైన వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతో, కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను(Nodal Officers) సైతం నియమిస్తున్నారు.

అందుకే డిసెంబర్ 28వ(28th December) తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు (New Ration Cards Issue) దరఖాస్తుదారుల నుండి, దరఖాస్తు పత్రాలు స్వీకరణకు సర్కారు ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఈ దరఖాస్తులను మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్ విధానంలో స్వీకరించనున్నారు. దరఖాస్తు సమయం ముగియక ముందే రేషన్ కార్డు కొరకు అవసరం ఉన్న పత్రాలను అన్నిటిని ఆన్లైన్(Online) విధానంలోనే సమర్పించాల్సి ఉంటుంది.

మొత్తం మీద ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను అధికారులు గ్రామం సభలు(Villages) అలాగే బస్తీ సభల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

కాబట్టి ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేయాలనీ అనుకుంటున్నారో వారు తప్పకుండ అవసరమైన అన్ని పాత్రలతో సిద్ధంగా ఉంది నిర్ణీత గడువులోగా ఈ సేవ కేంద్రాల్లో సమర్పించి లబ్ది పొందగలరు.

Leave a Comment