Uttarakhand tunnel rescue operation full story : సిల్క్యరా టన్నెల్ బాధితులు బయటకు..రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరిగింది..రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడిన మెషినరీ..బాధితులకు ఆహరం పంపింది ఎలాగంటే..
సిల్క్యరా టన్నెల్ ఈ నెల 12 వ తేదీ నుండి ఈ పేరు బాగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆ టన్నెల్ లో 41 మంది కూలీలు ఇరుక్కుపోవడమే, అసలు ఈ స్వరంగాన్ని ప్రభుత్వం ఎందుకు తవ్విస్తోంది, ఇది ఎక్కడ ఉంది. దీనిని తవ్వించడం వల్ల లాభం ఏంటి ? ఉన్నట్టుండి ఈ స్వరంగం లో ప్రమాదం ఎందుకు సంభవించింది. ప్రమాదానికి కారణాలు ఏంటి ? ఇది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా ? అధికారుల నిర్లక్ష్యమా ? ప్రభుత్వ అధికారులు టన్నెల్ లో ఇరుక్కు పోయిన కూలీలను ఎలా రక్షించారు ? వారిని బయటకు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ? వంటి అనేక అనుమానాలు సామాన్యుల మదిలో ఉత్పన్నం అవుతున్నాయి.
ఇది ఎప్పుడు మొదలైందంటే :
సిల్క్యరా టన్నెల్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది, ఈ టన్నెల్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణ దశలో ఉంది. ఈ టన్నెల్ ను సిల్క్యరా గ్రామం నుండి దండల్ గావ్ గ్రామాల మధ్య నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్ ను 3.6 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలని నిర్ణయించారు. అదే విధంగా ఈ టన్నెల్ నిర్మాణాన్ని 2024 లోగా పూర్తి చేయాలనీ సంకల్పించింది కేంద్ర సర్కారు.
అందులో భాగంగానే స్వరంగం పనులు కూడా వడివడిగా సాగుతున్నాయి. కానీ అనుకోకుండా ఈ టన్నెల్ లో ఒక ప్రమాదం ఏర్పడింది. టన్నెల్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా అందులో మట్టి కూలిపోయింది. దీంతో అందులో పనిచేస్తున్న 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం ఈ సిల్క్యరా టన్నెల్ త్రవ్వకాన్ని 2019 లో మొదలు పెట్టింది. ఈ టన్నెల్ త్రవ్వకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం 2018 లో దీనికోసం టెండర్ లు వేయడానికి అవకాశం ఇచ్చింది. అయితే టెండర్లు వేసిన కంపెనీల్లో ఒకదానికి నిర్మాణ అవకాశం కట్టబెట్టింది.
ఇది 17 రోజుల శ్రమ :
కేవలం ఒకటి లేదా రెండు రోజులు మనం బయటి ప్రపంచాన్ని చూడకపోయినా, మన కుటుంబ సభ్యులతో మాట్లాడకపోయినా విలవిలలాడిపోతాం. అందులోను ఏదైనా ప్రమాదంలో చిక్కుకుని బయటకు వస్తామో రామో అన్న సందిగ్ధంలో ఉంటె ఆ పరిస్థితి వర్ణనాతీతం.
అలంటి పరిస్థితి లో ఉన్న వారికి మనోధర్యం ఎంతో అవసరం. మనో నిబ్బరం, గుండె ధైర్యం లేకుంటే బ్రతికి బయట పడటం ప్రస్నార్ధకమే. బయట నుండి వారిని రక్షించడానికి ప్రయత్నం అయితే చేయగలరు కానీ లోపల ఉండిపోయినా వారిలో ఆత్మస్థైర్యాన్ని నూరిపోయడం అనేది మాత్రం అత్యంత కష్టతరమైన పని. కానీ మన అధికారులు ఆ రెండిటిని సమర్ధవంతంగా చేశారని చెప్పాలి.
దాదాపు 17 రోజులు నిర్విరామంగా కష్టించి స్వరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతూనే మరో ప్రక్క వారిలో నమ్మకాన్ని నింపుతూ వస్తున్నారు. లోపల చిక్కుకుపోయిన కూలీలను రక్షించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను వారికి వివరిస్తూ వచ్చారు. లాగానే బయట నుండి లోపల ఉన్నవారికోసం ఆహారం నీరు వంటి వాటిని ఎప్పటికప్పుడు సరఫరా చేశారు. అందువల్లనే వారు ఆకలిదప్పులతో ప్రాణాలు పోకుండా ఉండగలిగారు. లోపల చిక్కుకున్న వారిని ఆకలి దప్పులు లేకుండా చూసినంత తేలికకాదు వారిలో ధైర్యాన్ని నింపడం. ఇది చాలా సున్నితమైన విషయం. లోపల పనులు చేస్తూ ఉండగా స్వరంగం కూలిపోవడం వల్ల 41 మంది అందులో చిక్కుకుపోయారు.
ఆ ధైర్యం కల్పించారు :
స్వరంగంలో ఉన్న కూలీలు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయినట్టు అవుతారు. వారిని బయటకు తీసుకురావడం ఒకఎత్తయితే వారిని ఎలా రక్షిస్తున్నాము అనేది నిత్యం వారికి చెబుతూ వారిని నిబ్బరంగా ఉండేలా చేయడం మరో ఎత్తు.
అధికారులు వారితో మాట్లాడుతున్నారు, ఆహారం నీరు అందుతోంది కాబట్టి ధైర్యంగానే ఉంటారు కదా అనుకోవచ్చు, కానీ వారిని బయటకు తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోతే ఆ 41 మంది సజీవ సమాధి అవ్వవలసిందే, మరి అలంటి ఆలోచన బయట ఉన్నవారికే వస్తే లోపల స్వరంగంలో మట్టి రాళ్ల మధ్య చిక్కుకుపోయిన వారికి రావడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి వారతో అధికారులు నిత్యం మాట్లాడుతూ ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడతారు అనే దర్యాన్ని వారికి కలిగించారు.
మొదట ఆహారాన్ని అందించింది ఇలా :
అయితే ఇక్కడ చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి, స్వరంగం త్రవ్వుతుండగా అందులో కూలిపోవడం వల్ల కార్మికులు చిక్కుకునిపోయారు అని అన్నారు కదా మంరి ఆలా స్వరంగంలో చిక్కుకుపోయిన వారికి ఆహరం ఎలా పమ్పా గలిగారు అని అనుమానం రావచ్చు. ఒకవేళ ఆహారం పంపగలిగితే అసలు వారిని ఏకంగా స్వరంగం నుండి ఎందుకు బయతకు తీసుకురాలేకపోయారు అని అనుమానం కూడా రావచ్చు.
ఈ స్వరంగం లో చుక్కుకున్న వారికి మొదట్లో ఆహారం అందలేదు, కానీ అధికారులు తీవ్రంగా శ్రమించి సంపీడన గాలితో నింపబడిన 4 అంగుళాల పైపును బాధితుల వద్దకు పంపించారు. అది అధికారులు సాధించిన మొదటి విజయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పైపు గనుక వారి వద్దకు చేరుకోవడానికి వీలు కలిగి ఉండకపోయి ఉంటె వారికి ఆహరం చేరవేయడం దుస్సాధ్యం అయ్యేది. ఎప్పుడైతే నీరు ఆహారం లేదో అప్పుడు ఆకలితో ప్రాణాలు విల విలలాడుతూ ఉండేవి. దానివల్ల ప్రాణనష్టం కూడా సంభవించేది.
ఘనమైన ఆహారాన్ని అందించారు :
కానీ ఈ నాలుగు అంగుళాల పైప్ లైన్ ను వారి వద్దకు పంపంచడం వల్ల వారికి ఆహారాన్ని చేరవేయడం సాధ్యమైంది. మొదట్లో వారికి ధాన్యాలు, ఫ్రై చేసిన చిక్ పీస్ వంటి ఆహారాలను పంపించారు. ఆతరువాత నవంబర్ 20 వ తేదీన అధికారులు మరో పైప్ లైన్ ను బాధితుల వద్దకు పంపించారు.
ఈ రెండవ పైప్ లైన్ గుండ్రంగా ఉండే పైప్ లైన్ ఇది ఆరు అంగుళాలు ఉంటుంది. ఈ పైప్ లైన్ ద్వారా స్వరంగంలో చిక్కుకుపోయిన బాధితులకు కాస్త ఘనమైన ఆహారాన్ని నీటిని సరఫరా చేయగలిగారు. పోషకాహారం కోసం వారికి చపాతీ, కూరగాయలు ఇంకా కొన్ని రకాల పండ్లు అందజేశారు. వారికోసం ఆహారాన్ని చాలా భద్రంగా సీసాల్లో పెట్టి ఆ సీసాలను తాడు సాయంతో ప్రత్యేక మైన ట్రే తో అవతలి వైపుకు పంపించారు అధికారులు. దాని వల్లనే వారి ప్రాణాలను 17 రోజుల వరకు నిలపడం సాధ్యపడింది.
అధికారులకు అది పెద్ద సవాల్ :
టన్నెల్ లో చిక్కుకున్న బాధితులకు ఆహారం అందించడం కొంత విజయమే అయినప్పటికీ వారిని పూర్తిగా ఆ టన్నెల్ నుండి బయటకు సురక్షితంగా తీసుకువచ్చినప్పుడే పూర్తిగా విజయం సాధించినట్టవుతుంది. అందుకోసమే అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. వాటిలో ఆఖరు రోజు వారిని బాహ్య ప్రపంచానికి తీసుకువచ్చింది మాత్రం అగార్ బిట్. ఆగర్ బిట్ అని పిలిచే ఈ పరికరం ఒక హెలికల్ స్క్రూ లాంటి బ్లేడ్‌ను కలిగి ఉంటుంది. ఆగుర్ మెషిన్, ను ప్రయోగించినప్పుడు అది ఆ పదార్థంలోనికి చొచ్చుకు వెళ్లి రంధ్రాన్ని సృష్టించడానికి వీలవుతుంది. అలా ఆగారు మెషిన్ బిట్ తిరుగుతున్నప్పుడు దానికి ఉన్న బెడ్లు స్వరంగంలో ఉన్న మట్టిని తవ్వుతూ ముందుకు వెళ్లాయి.
టన్నెల్ త్రవ్వకానికి వాడిన మెషిన్ :
సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ కోసం అధునాతన టెక్నాలజీని వాడారని తెలుస్తోంది. స్వరంగం లో చిక్కుకున్న బాధితులను రక్షించడం కోసం, 600-1200 పవర్ తో పనిచేసే అమెరికన్ అగర్ ను ఉపయోగించారు. ఇది అధిక శక్తితో కూడిన అగర అనే చెప్పాలి. ఇందులో క్షితిజ సమాంతర డ్రిల్లింగ్ ఉపయోగించబడింది అని చెప్పొచ్చు. ట్రెంచ్‌లెస్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన US కంపెనీ అయిన అమెరికన్ అగర్స్ దీనిని తయారు చేసింది. ఈ యంత్రం సామర్ధ్యం గురించి చూస్తే ఇది 5-10 అడుగుల విస్తీర్ణంతో చాలా తేలికగా రంధ్రాలను చేయగలుగుతుంది.
అగర మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే :
ఈ అగర మెషిన్ లో ఒక ప్రత్యేకత ఉంది, ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ అగర మెషిన్ కి బ్లేడ్లు అమర్చబడి ఉంటాయి. అగర మెషిన్ కి ఉండే పదునైన ముందుభాగం మట్టిలోకి చొచ్చుకువెళ్లడానికి ఉపయోగపడితే దానికి ఉన్న బ్లేడ్లు మెషిన్ తో పాటు తిరుగుతూ ఉంటాయి. అలా బ్లేడ్లు తీరడం వల్ల మెట్టిని వాటి లోపలి లాక్కుని బయటకు పంపించేస్తుంది. కాబట్టి స్వరంగాలు చేయాలన్నా, లేదంటే భూమిలో లోతైన గుంత తవ్వాలన్నా ఈ అగర బిట్లను ఉపయోగిస్తూ ఉంటారు.
అగర కి ఉండే మెలితిరిగి ఉన్న స్క్రూ వంటి బ్లెడ్ ఇందులో కీలకమైంది గా చెప్పుకోవచ్చు. ఈ అగర బిట్ లోని స్పైరల్ డిజైన్ బ్లేడ్లు స్వరంగంలోని మట్టిని తవ్వడమే కాక బయటకు దూరంగా తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది. ఈ అగర బిట్ ను ఉపయోగించి ఒక మీటర్ స్థలాన్ని త్రవ్వడానికి కనీసం ఒక గంట సమయం పడుతుంది. ప్రస్తుతం సిల్క్యరా టన్నెల్ లోపల ఉన్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు అగర మెషిన్ కి 900 ఎంఎం అలాగే 800 ఎంఎం పైపులను అమర్చారు. ఈ పైపుల పొడవు ఆరు అడుగులు ఉన్నట్టు తెలుస్తోంది.
వారికి ఈరోజే అసలైన దీపావళి :
మొత్తానికి చీకటి స్వరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడం అన్నది చాలా గొప్ప పనిగా అభివర్ణించవచ్చు. నిర్విరామంగా కృషి చేసి వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. సరిగా దీపావళి పండుగ రోజున స్వరంగంలో చిక్కుకుపోవడం వల్ల సదరు కార్మికులు దీపావళి వెలుగులతో పాటు అసలు వెలుతురునే చూడలేకపోయారు. దీంతో కార్మికులు సిల్క్యరా నుండి సురక్షితంగా బయట పడ్డారు అని తెలియడంతో వారి కుటుంబ సభ్యులు మిక్కిలి సంతోషించారు. వారి ఆనాడు అవధులు లేకుండా పోయాయి.
తమ కుటుంబంలోని వారిని మరలా చూస్తామా మేడా అన్న సందిగ్ధంలో ఉండిపోయిన వారికి ఈ శుభవార్త అందడంతో సంబరాలు చేసుకున్నారు. నాడు 12వ తేదీన దేశమంతా సంతోషంగా జరుపుకున్న దీపావళిని వీరు ఈ రోజున జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు ఏకమై టపాసులు కాల్చుకున్నారు.
బాధితుల మనోభావం :
వీరిలో ఒక బాధితుడి కథ చిత్రమైనది, అతనికి ఇద్దరు కుమారులు, వారిద్దరూ కూడా ఇలా నిర్మాణ పనులతోనే జీవనాన్ని సాగిస్తున్నారు. కాగా పెద్ద కుమారుడు దురదృష్టవశాత్తు 2022 లో నిర్మాణ ప్రాంతం లో సంభవించిన ఒక ప్రమాదంలో అశువులుబాశాడు, మిగిలిన రెండవ కుమారుడు ఇలా చీకటి స్వరంగంలో చిక్కుకోవడంతో తమ జీవితం కూడా చీకటిమయం అయిపోయినట్టే అనుకున్నారు.
కానీ అధికారులు ఆ తండ్రికి దర్యాన్ని కల్పించడం కోసం అతని కుమారుడు స్వరంగంలో చిక్కుకుని ఉండగానే అతనితో మాట్లాడేందుకు రెండుపర్యాయాలు అవకాశం కల్పించారు. ఇక ఆఖరుకి తన కుమారుడు బయటకు రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక లోపల చిక్కుకున్న కార్మికుల మాటలను బట్టి చుస్తే వారు చీకటి స్వరంగంలో చిక్కుకుని ఉండగా ఒకరితో ఒకరు నిత్యం మాట్లాడుకుంటూనే ఉండాల్సి వచ్చేదట. అలాగే రాత్రి సమయంలో వారికి సరైన నిద్ర కూడా ఉండేది కాదని అన్నారు. పైగా అధికారులతో కూడా వారు తరచుగా మాట్లాడుతూ ఉండేవారట, అధికారులు వారిని రక్షించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే విషయాలను వీరికి వివరిస్తూ ఉన్నారట. అదే వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు.
శభాష్ అంటున్న మోదీ :
ఇక చీకటి స్వరంగం నుండి బయటకు వచ్చిన కార్మికులకు ముందుగా మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలను చేపట్టారు. సిల్క్యరా స్వరంగం వద్ద అంబులెన్సులు హెలికాఫ్టర్ లు కూడా సిద్ధంగా ఉంచారు. వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా ఉండేదుకు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని తెలుసుకుని హర్షాన్ని వ్యక్తం చేశారు.
కార్మిక సోదరులను రక్షించడం కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం అందరినీ భావోద్వేగానికి గురి చేసిందన్నారు. చీకటి స్వరంగం లో చిక్కుకుపోయినప్పటికీ కార్మికులు చూపిన ధైర్యం, సహనం ఆపదలో ఉన్న వారందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. కార్మికులంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇక కార్మికుల కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ టన్నెల్ ఆపరేషన్ సక్సస్ అయిందని తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ సీఎం తో ఫోన్ కాల్ ద్వారా ప్రత్యేకంగా సంభాషించారు మోదీ.