Vande Sadharan train full details ticket price : వందే సాధారణ్ ట్రయిల్ రన్ పూర్తి. ఈ రైలు చార్జీలు ఎంతంటే
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన వందే భారత్ ఎక్సప్రెస్సులు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. మొత్తం 34 రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్ధం ఇప్పటి వరకు రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
సెమీ-హైస్పీడ్ ఎస్ ప్రెస్ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్ తో ఉంటాయి. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారం లో బీజేపీ సర్కారు వందే సాధారణ్ ఎక్సప్రెస్ లను ప్రవేశ పెట్టనుంది.
ఈ తరహా రైళ్లు పూర్తిగా నాన్ ఏసీ రైళ్లుగా ఉంటాయి. ఇందులో స్లీపర్ ఇంకా జనరల్ భోగీలు ఉంటాయి. కానీ వందే భారత్ ఎక్సప్రెస్ లో జనరల్ భోగీలు కానీ, నాన్ ఏసీ భోగీలు గాని అందుబాటులో ఉండవు.
ఇక కొత్తగా ప్రవేశ పెట్టనున్న వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ కు ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు ట్రయిల్ రాం నిర్వహించారు. ఈ ట్రయిల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఇందులో సీసీటీవీ కెమెరాలతోపాటు, జరగబోయే ప్రమాదాల గురించి ముందుగానే అప్రమత్తం చేసేందుకు భద్రతా సెన్సార్లను ఈ రైలులో అమర్చారు.
ఈ వందే సాధారణ్ రైలుకు ముందు, వెనుక భాగంలో రెండు ఇంజిన్లు ఉంటాయి. సిగ్నలింగ్, ట్రాక్‌ల వీలును బట్టి వాటిని ఉపయోగిస్తారు.
ఈ రైలు గరిష్ఠ వేగం 130 కిలోమీటర్లు గా ఉంటుంది, కాబట్టి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండే ప్రయాణాలకు ఈ తరహా రైళ్లు అనుకూలం,గా ఉంటాయి.
ఈ రైలులో ఒకేసారి 1800 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. తొలి దశలో ముంబయి-న్యూఢిల్లీ, పట్నా-న్యూఢిల్లీ, హౌరా-న్యూఢిల్లీ, హైదరాబాద్-న్యూఢిల్లీ, ఎర్నాకులం-గువాహటి మార్గాల్లో ఈ రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముందుగా పలు ప్రముఖ నగరాల మధ్య వందే సాధారణ్ రైళ్లు ప్రవేశపెట్టి అనంతరం దశలవారీగా మిగతా మార్గాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ రైళ్లలో ప్రతి బోగీలో ప్రతి బోగీలో 64 సీట్లు ఉంటాయి. టాయిలెట్లు, హాండ్‌వాష్, డైనింగ్‌కోర్ట్, టీ-కాఫీ స్టాల్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉంటాయి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల మాదిరిగానే నిర్ణీత సమయంలో లక్ష్యస్థానానికి చేరుకుంటాయి. భారతీయ రైల్వేల టారిఫ్ చట్టం ప్రకారం వీటి టిక్కెట్ ధరలు నిర్ణయించబడతాయి. మొదట దశలో 15 వందే సాధారణ్ రైళ్లు ప్రారంభించాలని భావిస్తున్నారు.