Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ – ఫస్ట్ స్ట్రైక్ తో వచ్చాడు వరుణ్ తేజ్.
యుద్ద నేపథ్యంలో తెలుగులో మరో సినిమా రాబోతుంది. వరుణ్ తేజ్ మరియు మానుషి చిల్లర్ కీలక పాత్రలలో, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ” ఆపరేషన్ వాలెంటైన్ “(Operation Valentine). ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది.
ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు అన్నీ దాదాపు పెద్ద పెద్ద సినీతారలతో కలిసి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలే.ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఇటీవల వచ్చిన హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాలోని యుద్ద విమానాల వాతావరణాన్ని పోలి ఉంటుంది.
ఈ ఆపరేషన్ వాలెంటైన్ చరిత్రలోనే జరిగిన అతిపెద్ద భారత వైమానిక దాడిపై ఆధారంగా చిత్రీకరించబడింది.
ఈ సినిమాకి దర్శకత్వం శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగు మరియు హిందీ భాషలలొ రాబోతుంది.
ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ మరియు A RENAIISSANCE PICTURES నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థలో ఇంతకు ముందు కూడా ఇలాంటి యుద్దం తరహా సినిమా వచ్చింది.
ఈ సినిమాలో వరుణ్ తేజ IAF అధికారి అర్జున్ దేవ్ పాత్రలో రుద్ర అనే కాల్ గుర్తుతో నటించాడు.
ఈ ట్రైలర్ లో విమానిక సన్నివేశాల క్లిప్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి.
ట్రైలర్ లో ఈ దేశం గాందీజీదే కాదు సుబాష్ చంద్ర బోస్ ది కూడా అన్న డైలాగ్ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.మొత్తంగా దీనిలో దేశభక్తి, విమానిక దాడులు, ప్రేమ అన్నీ కలగలిపి ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమా 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.