వసంత పంచమి దేనికి ప్రాముఖ్యత – ఈరోజు విద్యార్ధులు ఎం చేయాలి : Vasantha Panchami – What should students do today?

website 6tvnews template 60 వసంత పంచమి దేనికి ప్రాముఖ్యత - ఈరోజు విద్యార్ధులు ఎం చేయాలి : Vasantha Panchami - What should students do today?

Vasantha Panchami – What should students do today? : మన భారత దేశం లో సరస్వతిని పూజించడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది అదే మాఘమాసం లో వచ్చే వసంత పంచమి. ఈ రోజున చదువు కుంటున్న విద్యార్ధిని విద్యార్ధులు ఈ సరస్వతి అమ్మవారిని పుజించినట్లయితే తప్పక ఆ అమ్మ వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

అంతే ఇదే రోజున పేరెంట్స్ తమ పిల్లలకి అక్షరా భ్యాసం చేస్తారు. ఇలా చెయ్యడం వలన వారు తమ చదువులలో చక్కని విజయావకాశాలు అందుకుంటారని నమ్మకం. మన పురాణ ఇతిహాసాల ప్రకారం జ్ఞానంకి అధిదేవత సరస్వతీదేవి. మన హిందువలందరికి మాఘ మాసం లో వచ్చే ఈ వసంత పంచమి ఒక ప్రత్యకం . ఈరోజునే వసంత రుతువు మొదలు అవుతుందని అంటారు.

ఈ అమ్మ వారి చేతి లో వీణ , ఇంకో చేతి లో పుస్తకం తో జపమాల ఉంటాయి . అమ్మ వారు అభయ ముద్రలతో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఈమె రక్షణ ఉంటె అన్నింటి లోను విజయం లభిస్తుందని మహర్షులు చెప్పినట్లు మన పురాణాలలో ఉందని మన పెద్దలు చెప్తారు

వసంత పంచమి ప్రత్యేకత :
ఈ రోజున సరస్వతి అమ్మ వారి పాదాల వద్ద పుస్తాకాలు అలాగే పెన్నులు పెట్టి పూజించడం ఆనవాయతి. ఇలా చేస్తే వార్కి మరింత జ్ఞానం కల్గుతుందని నమ్మకం. అంతే ఈరోజు ఎటువంటి శుభాకార్యలను అయిన మొహుర్థం తో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. అలాగే ఏ పని అయిన మొదలు పెడితే కూడా మంచిది

వసంత పంచమి పూజా చేసే విధానం :
విద్యార్ధులు ఈ రోజున పొద్దున్నే తల స్నానం చేసి మంచి తెలుపు బట్టలు వేసుకోవాలి. సరస్వతి దేవి పటాన్ని పువ్వులతో అలంకరించి పూజలు చెయ్యాలి. తమకి సంబందించిన పలక, పెన్ను, పుస్తకాలు ఉంచి తమకి శక్తీ కొలది పూజలు తో పాటు అమ్మ వారికి ఇష్టమైన పదార్ధాలతో నైవేద్యం పెట్టాలి.

ప్రత్యేకం ఆలయ దర్బాసనం :

చాలామంది ఈ వసంత పంచమి రోజున బాసర క్షేత్రాన్ని వెళ్తారు . ఇది సరస్వతి అమ్మవారి ఆలయం. ఇక్కడే తమ పిల్లలకి అక్షరా బ్యాసం చెయ్యాలని అనుకుంటారు. వ్యాసుడు తపస్సు కోసం ఈ పవిత్ర గోదావరి తీరం లో ఉన్న బాసర క్షేత్రానికి వచ్చినట్లు భక్తుల విశ్వాసం.

ఇక్కడే వ్యాసుల వారికి అమ్మ వారు కనిపించి గోదావరి ఇసుక తో తన రూపాన్ని విగ్రహం మలచ మని చెప్పిందని అలా వ్యాస మహర్షి అమ్మ వారి విగ్రహాన్ని తయారు చేసారని చెప్తారు. ఇప్పుడు మనం దర్శించుకునే విగ్రం కుడా అదే.

Leave a Comment