ఇక తెలంగాణా లో వాహన నెంబర్ ప్లేట్ మీద TS కాదు TG ఉండాలి.

website 6tvnews template 2024 03 13T141708.680 ఇక తెలంగాణా లో వాహన నెంబర్ ప్లేట్ మీద TS కాదు TG ఉండాలి.

vehicle number plate TS to change TG : ఇక మీదట తెలంగాణా లో కొత్త గా కొన్న వాహనాల రిజిస్ట్రేషన్ TS కి బదులు గా TG మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక G.O విడుదల చేసింది. ఇక రాష్ట్రం లో మోటారు వాహనాల చట్టం ప్రకారం 1988 లోని సెక్షన్ 41 (6) క్రింద TS స్దానం లో TG ని ప్రవేశపెడుతూ సెంట్రల్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ శాఖ కూడా ఒక G.O జారీ చేసింది.

ఒకప్పటి ప్రభుత్వం అంటే 1989 జూన్ 12 న జారీ చేసిన G.O లో కావలసిన మార్పులు చేర్పులు చేసింది. తెలంగాణా లో రేవెంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఇక రాష్ట్రం లో వాహనాల రిజిస్ట్రేషన్ పద్దతిని మార్చేందుకు ఆప్పట్లోనే నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే అని చెప్పవచ్చు. అధికారం లో వచ్చాక ఈ విషయం పై రాష్ట్ర తీర్మానాన్ని వెంటనే కేంద్రానికి పంపడం జరిగింది. దీంతో తీర్మానం కి అనుగుణం గ మార్పులు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

దీని ఫలితంగా ఇక మీదట వాహనాలు కొనుగోలు చేసిన వారు T S కి బదులు TG మార్కుతో రిజిస్టర్ చేయనున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

Leave a Comment