Vibrant Gujarat: వైబ్రెంట్ గుజరాత్ (Vibrant Gujarat),గుజరాత్ ప్రభుత్వం ఒక సదస్సు నిర్వహిస్తోంది. దీనిని ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టింది.
గుజరాత్ రాష్ట్రాన్ని ప్రపపంచ స్థాయి వ్యాపారానికి పెట్టుబడి కేంద్రంగా మార్చాలన్నదే ఈ సదస్సు నిర్వహణ యొక్క ప్రధాన ఉద్దేశం.
ఈ సదస్సుకు మనదేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతోపాటు ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన బిజినెస్ మాగ్నెట్స్,
సైన్టిస్టులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సదస్సు ను గతంలో 2023 సంవత్సరంలో ఉద నిర్వహించారు. నాటి సదస్సులో 1లక్ష 50 వేలకు పైగా పాల్గొన్నారు.
📲|💻Register for #VGGS2024 and explore opportunities of 🌐global partnerships and growth.
— Vibrant Gujarat (@VibrantGujarat) December 2, 2023
👉Register today:https://t.co/zUa4WVKNxG#20Yearsofvibrantgujarat | #20yearsofvggs #gujaratsuccessstory | #VibrantGujarat2024 #VibrantGujaratGlobalSummit pic.twitter.com/Z5RN1g5LDm
ఈ వైబ్రెంట్ గుజరాత్ అనే కార్యక్రమం అనేక ప్రయోజనాలు కలిగిఉంది. ఈ సదస్సు గుజరాత్ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇది పెట్టుబడిదారులు,
వ్యాపారవేత్తలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వారధిగా ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా అభివృద్ధి చెందుతాయి. గతంలో నిర్వహించిన ఈ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులు విజయవంతమయ్యాయి.
యూఏఈ అధ్యక్షుడితో మోదీ రోడ్ షో: PM Modi Road Show With UAE President.
అయితే ఈ సంవత్సరం నిర్వహించబోయే సదస్సు కూడా విజయవంతం అయ్యే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. వివిధ దేశాల నుండి ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు వస్తుండటంతో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
అదే స్థాయిలో భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది సదస్సుకు గుజరాత్ రాష్ట్ర రాజధాని అయిన గాంధీ నగర్ (Gandhi Nagar) వేదిక కానుంది,
దీంతో గాంధీనగర్ ను సర్వాంగ సుందరంగా తీర్డ్చిదిద్దారు. ఈ సదస్సు జనవరి 10వ తారీఖున మొదలై జనవరి 12వ తేదీతో ముగుస్తుంది. ప్రధాని మోదీ ఇప్పటికే గుజరాత్ చేరుకోగా, సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరవనున్న మొజాంబిక్ (Mozambique)
అధ్యక్షుడు ఫిలిప్ న్యూసే (Philip Nyusi) కూడా భారత్ (India) కు చేసుకున్నారు. మరో వైపు ఈ సదస్సుకు యూఏఈ (UAE) అధ్యక్షుడు
మొహమ్మద్ బిన్ జాయెల్ ఆల్ హాసన్ (Mohammad Bin Jayel Al Hassan) కూడా ఈ సదస్సుకు రానున్నారు. ఈ సదస్సులో భాగంగా మొహమ్మద్ బిన్ జాయెల్ ఆల్ హాసన్, మోదీ ఇద్దరు కలిసి రోడ్డు షో నిర్వహిస్తారు.