Vidhi Movie review: విధి సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరించింది.దర్శక ద్వయం విజయాన్ని అందుకున్నారా.

ezgif 1 1c610fefc8 Vidhi Movie review: విధి సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరించింది.దర్శక ద్వయం విజయాన్ని అందుకున్నారా.

Vidhi Movie Riview : విధి సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరించింది..దర్శక ద్వయం విజయాన్ని అందుకున్నారా..

ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమాల్లో విధి కూడా ఒకటి. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన సినిమా విధి.

ఇది సస్పెన్స్ త్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన చిత్రం. రోహిత్ నంద, ఆనంది జంటగా నటించగా మహేష్ ఆచంట, మీసం సురేష్ తదితరులు ముఖ్య మాత్రలు పోషించారు. రంజిత్ ఎస్ నిర్మించిన ఈ సినిమాని కు శ్రీచరణ్ పాకల సంగీతాన్ని అందించారు.

ఇక కథ విషయానికి వస్తే హీరోకి ఈ సినిమాలో ఒక పెన్ను దొరుకుతుంది, ఆపెన్నుకు ఒక వేశేషముంటుంది. దాని చుట్టూనే కదా తిరుగుతుంది. ఈ సినిమాలో హీరో మామూలు పల్లెటూరి కుర్రాడు. ఎంతోమంది ఎన్నో ఆశలతో ప్రతి రోజు హైదరాబాద్ నగరానికి వస్తారు.

అలానే సూర్య(హీరో రోహిత్ నంద) కూడా హైద్రాబాద్ వస్తాడు. ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించి తనకి ఉన్న అప్పులు తీర్చుకోవాలన్నదే తన ముందున్న అతి పెద్ద లక్ష్యం. అక్కడే నాయిక ఆనంది పరిచయం అవుతుంది.

అయితే ఈ క్రమంలో సూర్యకు ఒక చోట ఉద్యోగం లభిస్తుంది. అక్కడే సూర్య చేతికి ఒక పెన్ను దొరుకుతుంది. అలా దొరికిన పెన్ను గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు సూర్య.

ఆ పెన్ను సూర్య లైఫ్ ను ఎలా మార్చేసింది. ఆ కలం విశేషం ఏమిటి ? అని తెలియాలంటే విధి సినిమాను చూసి తీరాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఆనంది పాత్ర నిడివి కాస్త తక్కువ అనే చెప్పాలి.

అయినా ఆమె తన క్యారెక్టర్ కి న్యాయం చేసిందనే చెప్పొచ్చు. ఇక సినిమా లో సాగదీత ఎక్కువ ఉంటుంది. పాత్రల పరిచయం, అవ్వగానే వెంటనే అసలు కథలోకి వెళ్ళలేదు దర్శకులు. సన్నివేశాల సాగదీత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.

ezgif 5 b78ad893f7 Vidhi Movie review: విధి సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరించింది.దర్శక ద్వయం విజయాన్ని అందుకున్నారా.

సస్పెన్స్ థిల్లర్ అని ఆశించి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి ఆశించిన స్థాయిలో ఆసస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ సీన్స్ ఉండవు. అయితే అసలు లేదని చెప్పలేము కానీ, ఎక్కడో ఒకటి ఆరా ఉంటాయి.

ఇక తదుపరి సీన్ ఏముంటుందో చెప్పే విధంగానే సినిమా సాగడంతో ఎక్కడ ఆడియన్స్ ను రంజింపలేకపోయింది సినిమా. మరీ ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రలకు మధ్య ఇంకా కొన్ని సన్నివేశాలు ఉంటె బాగుండేదేమో అనిపిస్తుంది.

బేసిక్ గా ఇలాంటి చిన్న సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటేనే ప్రేక్షకుడు లిప్ లాక్ సన్నివేశాలను ఊహించుకుని వస్తాడు. కానీ అటువంటివాటికి ఇందులో స్థానం లేకపోయింది.

ఇక సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది కథ అని చెప్పాలి. ఆ కథను దర్శకులు ఇంకాస్త సమర్ధవంతంగా మలుచుకుని ఉంటె బాగుండేది అనిపిస్తుంది.

అయినప్పటికీ కొన్ని సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. ఇక హీరో నంద కొత్తవాడైనా బాగానే చేశాడని చెప్పాలి. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో చక్కని నటనను కనబరిచాడు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకల కొన్ని సన్నివేశాలను తన సంగీతంతో మరింత రక్తి కట్టించాడు. శ్రీనాథ్ రంగనాథన్ అందించిన సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లు పర్వాలేదనిపించాయి.

మొత్తమ్మీద ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అని చూపొచ్చు. స్క్రీన్ ప్లే ని గనుక సెట్ చేసుకుని ఉంటె సినిమా బాగానే ఆడి నిర్మాతకు అంతకంత డబ్బు తెచ్చిపెట్టి ఉండేది.

అయితే కొత్త కుర్రాళ్ళు అయినప్పటికీ డైరెక్టర్లు ఇద్దరు సినిమాను మంచి పాయింట్ తోన్ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే సినిమాలోని విషాదభరిత సన్నివేశాలను ఇంకా కొంచం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి ఉంటె బాగుండునేమో అనిపిస్తుంది.

Leave a Comment