ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో మానవాళికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు ఈ టెక్నాలజీ సహాయంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దండుకుంటున్నారు.
ఎన్ని చట్టాలు వచ్చినా.. పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈమధ్యనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ప్రొడక్షన్స్ పేరుతో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నం చేశారు. తాజాగా బాలీవుడ్ (Bollywood ) ప్రముఖ నటి విద్యాబాలన్ (Vidya Balan) ను కూడా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఇంస్టాగ్రామ్ (instagram ) లో ఆమె పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి జాబ్స్ ఇప్పిస్తామంటూ డబ్బులు దండుకునే ప్లాన్ వేశారు. దీంతో అలర్ట్ అయిన విద్యాబాలన్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చింది.
Vidya Balan Files Police Complaint : పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విద్యాబాలన్ :
బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ (Vidya Balan) సైతం సైబర్ నేరగాళ్ల మోసానికి బలైంది. కొంతమంది కేటుగాళ్లు ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ (instagram )లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. నటి లాగే రీల్స్ క్రియేట్ చేసి, ఫోటోలు అప్లోడ్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు దండుకున్నారు.
తన పేరుతో మోసం జరుగుతోందని ఓ కాస్ట్యూమ్ డిజైనర్‌కు చెప్పడంతో విద్యబాలన్ వెంటనే అలెర్ట్ అయ్యి పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు సెక్షన్ 66 (C) ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి సైబర్ నేరస్తుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
9.2 million instagram fallowers : ఇంస్టాగ్రామ్ లో 9.2 మిలియన్ ఫాలోయర్స్ :
విద్యాబాలన్ (Vidya Balan)సహజ సిద్ధమైన నటి ఈమెకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో ఆమె నటించింది. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు వారికి కూడా విద్యాబాలన్ సుపరిచితమే. సిల్క్ స్మిత (Silk Smitha) బయోపిక్ డర్టీ పిక్చర్ (Dirty Picture )లో నటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది విద్యాబాలన్.
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ విద్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. వివిధ రకాల కామెడీ రీల్స్, ట్రెడిషనల్ వేర్ లో దిగిన ఫోటోషూట్ పిక్స్ ను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో దాదాపు 9.2 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకునే సైబర్ నేరగాళ్లు ఆమె పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించారు . అందుకే సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు . ఫేక్ పోస్ట్ లకు స్పందించి ఇబ్బందుల్లో పడొద్దని చెప్తున్నారు.
Vidya Balan upcoming projects : విద్యాబాలన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ :
విద్యాబాలన్ (Vidya Balan) ప్రస్తుతం ‘భూల్ భులయ్యా 3’ (BhoolBhulaiyaa3)లో నటిస్తోంది. ఈ మూవీలో మంజులికగా కనిపించునుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ ( Karthik Aryan ) స్వయంగా అనౌన్స్ చేశారు. 2007లో ‘భూల్ భులయ్యా'(BhoolBhulaiyaa)లో ఎనర్జిటిక్ హీరో అక్షయ్ కుమార్ ( Akshay Kumar ) సరసన విద్యాబాలన్ నటించింది. ఆ తర్వాత రెండో భాగంలో లో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ( Kiara Advani ), టబూ (Tabu ) లు నటించారు.