ఖుషి (Kushi) తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (VijayDeverakonda)చేసిన మూవీ ఫ్యామిలీ స్టార్ (The Family Star). గీతా గోవిందం (Geetha Govindam) సూపర్ డూపర్ హిట్ తర్వాత పరశురాం (Parashuram)విజయ్ కాంబోంలో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలో విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)ఈ మూవీని నిర్మించారు. విజయ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)నటించింది. మరి పరశురామ్ గీతాగోవిందం హిట్ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడా? అనేది ఇవాళ్టితో తేలిపోయింది. ఫ్యామిలీ స్టార్ మూవీపై ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ లో ఫస్ట్ షో కంప్లీట్ అయ్యింది. ఈ మూవీపై ట్విటర్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు అక్కడి ప్రేక్షకులు. మరి ఈ సినిమా హిట్టా…లేదా ఫట్టా..విజయ్ కి మళ్లీ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిందా..మృణాల్ మ్యాజిక్ ఏమైనా వర్కౌట్ అయ్యిందా తెలుసుకుందాం.
ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు :
ఎన్నో అంచనాలతో ఫ్యామిలీ స్టార్ థియేటర్లలో విడుదలైంది. సినిమా రిలీజ్ కు పది రోజుల ముందు స్టార్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)లు కాలేజీలని, ఈవెంట్లని, టీవీ షోలని ఎన్నడు లేనంతగా ప్రమోషన్లతో జనాలను అట్రాక్ట్ చేశారు. . ఇక ప్రొడ్యుసర్ దిల్ రాజు (Dil Raju)అయితే ఏకంగా డ్యాన్సులు ఫ్యామిలీతో ఇంటర్వ్యూలు ఇస్తూ.బాగానే కష్టపడ్డారు. తాజాగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ మూవీకి ట్విటర్ లో మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేశానని ఓ అభిమాని ట్విట్టర్ లో రివ్యూ పెట్టాడు. ఈ సినిమాపై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని, జస్ట్ ఎంటర్టైన్ అవ్వమని సలహా ఇచ్చాడు. ఇంకా ఈ మూవీలో రౌడీ బాయ్ విజయ్ పెర్ఫార్మన్స్ కొత్తగా ఉందని తెలిపాడు. అంతే కాదు అతని స్కిన్ టోన్ సూపర్ అని పొగిడేశాడు. మృణాల్ ఠాకూర్ ఎప్పటిలాగే బాగా నటించిందని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. మాస్ & కమర్షియల్ మైండ్ సెట్ తో కాకుండా ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఈ సినిమా చూడొచ్చని సలహా ఇచ్చాడు.
ఫ్యామిలీ స్టార్‌కు 4/5 రేటింగ్ :
ఇక మరో నెటిజన్ ఫ్యామిలీ స్టార్ అందరినీ మెప్పించడం కష్టమని రివ్యూ ఇచ్చాడు. మొదటి భాగం యావరేజ్, కానీ సెకండాఫ్ అనుకున్నంత లేదని తెలిపాడు. డైరెక్టర్ రిపీటెడ్ సీన్స్‌తో ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టాడని అన్నాడు. విజయ్ తో సహా , మిగిలిన ఆర్టిస్టుల పర్ఫామెన్స్ అంత గొప్పగా లేదని అంటున్నారు. ఇక మరికొంత మంది మిడిల్ క్లాస్ ప్రజలకు బాగా నచ్చే మూవీ అని చెబుతున్నారు. ఇక సీతారామం బ్యూటీ మృణాల్ క్యారెక్టర్ సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ పాత్రనే గుర్తుచేస్తోందని మరోక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక మూవీలో అక్కడక్కడ టీవీ సీరియల్ ఫీలింగ్ కలిగిందని మరికొంత మంది అంటున్నారు. కొంత మంది మినహా ట్విట్టర్ టాక్ ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ గానే ఉంది. మరి సినిమా కు 4/5 రేటింగ్ ఇచ్చారు. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.