రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఫ్యామిలీ మెన్ గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. పరుశురామ్ (parushuram)డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో సీతారామం (Sitharamam) ఫేమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)హీరోయిన్ గా నటిస్తోంది. గీతా గోవిందం (Geetha Govindam) బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరుశురామ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ విజయ్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు లేటెస్టుగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీని అని అర్థమవుతోంది. ఇప్పటి వరకు రౌడీ బాయ్ గా కనిపించిన విజయ్ ఈ సినిమాలో కంప్లీట్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తున్నాడు. దీంతో ప్రేక్షకులందరికీ ఈ ట్రైలర్ బాగా కనెక్టవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, బాధ్యతల మధ్య తన లవ్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడు.. కెరీర్ లో ఎలా సెటిల్ అవుతాడు అన్న అంశాలను ఫ్యామిలీ స్టార్ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
లైగర్ దెబ్బతో వాటిపైనే ఫోకస్ :
ఖుషి (Kushi) సినిమా తర్వాత విజయ్ చేస్తున్న మూవీ ఇది. లైగర్ దెబ్బతో రౌడీ బాయ్ పూర్తిగా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పైనే ఫోకస్ పెట్టాడు. అందుకే ఇప్పుడు పరుశురాం (parushuram)తో ఫ్యామిలీ స్టార్ చేశాడు. పరుశురామ్ డైరెక్షన్ లో వచ్చిన గీతా గోవిందం(Geetha Govindam) మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్నల కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. అయితే డైరెక్టర్ గీతాగోవిందం కంటే.. ఫ్యామిలీ స్టార్ మూవీలో యాక్షన్ పార్ట్ పెట్టారని తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ మృణాల్ కాకుండా ఈ మూవీలో అమెరికన్ నటి మరిస్సా రోజ్ గార్డన్ (Marissa Rose Garden), మజిలీ ఫేమ్ నటి దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రష్మిక మందన్న(Rashmika Mandanna)లు కనిపిస్తారని టాక్. ఇక ఈ మూవీకి గోపిసుందర్ మ్యూజిక్ అందించారు.
ఏప్రిల్ 5 ఫ్యామిలీ స్టార్ (Family star)మూవీ రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. విజయ్, మృణాల్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాకు హైప్ తీసుకొస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. ” స్కూల్ డేస్ లో సైకిల్ కావాలని నాన్నను అడిగాను. నా బర్త్ డేకు కొంటానని. హాలిడేస్ లో కొంటానని చెప్పేవారు.
కానీ ఎప్పటికో ఆ కోరికను తీర్చారు. సైకిలే కాదు, చిన్నప్పుడు చాలా మందికి చాలా కోరికలు, వస్తువులపై ఆసక్తి ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా అవి నెరవేరకపోవచ్చు. అడ్జస్ట్మెంట్ అనేది లైఫ్ లో ఓ పాఠం . ఇప్పటికీ నేను ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతుంటా”అని చెప్పుకొచ్చాడు.