Vijay Devarakonda: ఫ్యాన్‎కి విజయ్ వార్నింగ్ ..ఎందుకంటే..?

website 6tvnews template 2024 03 30T112819.684 Vijay Devarakonda: ఫ్యాన్‎కి విజయ్ వార్నింగ్ ..ఎందుకంటే..?

తెలుగు రాష్ట్రాల్లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి (Arjun Reddy)మూవీ తర్వాత అందరి ఫేవరేట్ స్టార్ అయిపోయాడు విజయ్. తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశ వ్యాప్తంగా తన స్టైలిష్ యాక్టింగ్ తో , సోషల్ యాక్టివిటీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.

అందుకే విజయ్ పేరు చెబితే వైబ్రేట్ అయ్యే ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా అనేకమంది ఉన్నారు. మరికొందరు భక్తులు కూడా ఉన్నారని తాజాగా జరిగిన ఓ సంఘటనతో క్లారిటీ వచ్చింది. విజయ్ ఫ్యాన్ అభిమాని ఒకరు తన బాడీలోంచి బ్లడ్ తీసి విజయ్ బొమ్మను గీసాడు. ఆ ఫోటోను విజయ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. విషయం తెలుసుకున్న విజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

సినీ స్టార్స్ కు అభిమానులు కామన్. కొంత మంది తమ ప్రియమైన నటుడంటే ప్రాణం ఇచ్చేస్తుంటారు. వారి వారి అభిమానాన్ని చాటుకునేందుకు సామాజిక కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లు చేస్తుంటారు. కానీ ఈ అభిమాని మాత్రం తన బ్లడ్ ను తన ఫేవరేట్ హీరోకే ఇచ్చేశాడు. తన శరీరంలోని రక్తంతో విజయ్ ముఖాన్ని గీసి విజయ్ కే గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఈ క్రమంలో విజయ్ కి, ఫ్యాన్ కి మధ్య జరిగిన సంభాషణతో కూడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ముందు విజయ్ దేవరకొండకు, తన అభిమానికి ఫోటోను ఇస్తుండగా అది మామూలుగా గీసిన బొమ్మ అని అనుకున్నాడు. పక్కనే ఉన్న వారు అది రక్తంతో గీసిన చిత్రమని అనడంతో తన అభిమానిని మళ్లీ వెనక్కి లాగి ఫోటోను చూవాడు. ‘బ్లడ్ ఆ.. అరేయ్ మెంటల్ ఇలాంటివి చెయ్యకు’ అంటూ ఆ కుర్రాడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

అవును రిలేషన్ షిప్‎లో ఉన్నాను :

ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ డైరెక్టర్ పరుశురాం (Parashuram)ఈ మూవీని తీశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు జోడీగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)హీరోయిన్ గా నటిస్తోంది. ఇఖ ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. ఇంటర్వ్యూలతో ఆడియన్స్ తో కనెక్ట్ అవుతున్నాడు.

తాజాగా ఇచ్చి ఓ ఇంట‌ర్వ్యూలో హోస్ట్ మీరు రిలేషన్ లో ఉన్నారా అని ప్రశ్నించగా … విజ‌య వెంటనే ఎస్ ఐ యామ్ ఇన్ రిలేషన్. మా అమ్మ, నాన్న‌, త‌మ్ముడితో రిలేషన్ లో ఉన్నాను అని తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో కూడా వైరల్ కావడంతో . దీనిపై దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. భ‌లే చెప్పావు భయ్యా అని అంటున్నారు.

Leave a Comment