రౌడీ బాయ్ రెడీ…’ఫ్యామిలీ స్టార్‌’ టీజర్ రిలీజ్

website 6tvnews template 2024 03 05T111135.334 రౌడీ బాయ్ రెడీ…'ఫ్యామిలీ స్టార్‌' టీజర్ రిలీజ్

Vijay Deverakonda Family Star Teaser Release: లైగర్(Liger)ఫ్లాప్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఇమేజ్ పై బాగానే ప్రభావం చూపింది. ఈ సినిమాతో విజయ్ మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులు కావడంతో విజయ్ కూడా కాస్త ఆచీతూచి అడుగులు వేస్తూ సినిమాలను ఎంచుకుంటున్నాడు.

అందుకే గత సంవత్సరం ‘ఖుషి'(Kushi)మూవీతో లవర్ బాయ్ గా ఫ్యాన్స్ ను అలరించిన ఈ రౌడీ బాయ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. పరుశురాం (parashuram) దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ కు రెడీ అయ్యింది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే తాజాగా ఫ్యామిలీ స్టార్ టీజర్ లాంచ్‌ చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటిని పెంచింది.

ఫ్యామిలీ స్టార్ టీజర్‌ ఎలా ఉంది? :

ఫ్యామిలీ స్టార్ (Family Star) టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ టీజర్‌లో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా చాలా కూల్‌ గా కనిపించాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా కుటుంబానికి ఆపద వస్తే రౌడీలా కూడా కనిపిస్తాడని ఈ టీజర్ ద్వారా చూపించాడు దర్శకుడు. ఇక ఈ టీజర్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), విజయ్‌ దేవరకొండ మధ్య జరిగిన సంభాషణ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఓ బస్టాప్‌లో ఉన్న మృణాల్ విజయ్‌ని ‘ఏవండి.. కాలేజ్‌కి వెళ్లాలి.. కాస్తా దింపుతారా? అని అడుగుతుంది. దీనికి విజయ్ లీటర్‌ ప్రెట్రోల్‌ కొట్టించు దించేస్తా’ అని అనడం కాస్త కొత్తగా అనిపించింది. ఇదే సీన్ టీజర్‌కి హైలెట్‌ అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ టీజర్‌ మిడిల్‌ క్లాస్‌ ను మెప్పించడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.

విజయ్ ఆశలన్నీ దీనిపైనే :

పాన్‌ ఇండియా సినిమా అంటూ వచ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ లైగర్‌ (Liger)విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొంపముంచింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. విజయ్ ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశ పరిచింది.

మేకర్స్‌ను సైతం భారీ నష్టాల్లో ముంచేసింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకున్న విజయ్‌ ‘ఖుషి’(Kushi)అంటూ లవ్ స్టోరీతో పలకరించాడు. శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో సమంత (Samantha) హీరోయిన్ అన్న అంశం చాలామంది ప్రేక్షకులను ఎగ్జైట్ చేసింది. అయితే ‘ఖుషి’కూడా మిక్స్‌డ్ టాక్‌తో అవరేజ్ గానే ఆడింది. ‘లైగర్’ దెబ్బ ‘ఖుషి’ కాస్త కవర్ చేసినా హిట్ కొట్టలేదు. అందుకే ఇప్పుడు ఆశలన్నీ ‘ఫ్యామిలీ స్టార్’పైనే పెట్టుకున్నాడు విజయ్ .

ఇప్పటికీ ఈ సినిమాలో విజయ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో గ్లింప్స్ ద్వారా చూపించారు మేకర్స్. మృణాల్ కూడా మిడిల్ క్లాస్ అమ్మాయిలాగే కనిపిస్తోంది. అయితే ఆమె క్యారెక్టర్ ను డైరెక్టర్ ఎక్కువగా రివీల్ చేయలేదు. అందుకే టీజర్‌లో మృణాల్‌ను చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment