Vijay Sethupati: బాలీవుడ్(Bollywood) మేకర్స్ కూడా విజయ్ సేతుపతిని(Vijay Sethupati) పెట్టి సినిమాలు చేస్తున్నారు అంటే ఈ వెర్సటైల్ యాక్టర్ ఎంతటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా.
కేవలం హిందీ లోనే కాదు విజయ్ సేతుపతి డేట్స్ కోసం తెలుగు(Telugu) దర్శక నిర్మాతలు(Directors &Producers) కూడా వెయిట్ చేస్తున్నారు.
గడిచిన రెండేళ్లలో సేతుపతి తమిళ్(Tamil) లో ఎంత బిజీగా ఉన్నాడో హిందీలో కూడా అంతే బిజీగా ఉన్నాడు. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Sharuk Khan) హీరో గా నటించిన జవాన్(Jawan) సినిమాలో ప్రతినాయక పాత్రను పోషించాడు.
అంతే కాదు మేరీ క్రిస్మస్(Merry Cristmas) అనే సినిమాతో హిందీ చిత్రసీమలోకి హీరిపోగా ఎంటర్ కాబోతున్నాడు ఈ దక్షిణాది నటుడు. అయితే ఉన్నట్టుండి సేతుపతి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
తాను ముఖ్య పాత్ర పోషించిన సూపర్ డీలక్స్(Super Deluxe) సినిమాకి అన్యాయం జరిగిందని, ఆ సినిమా విషయంలో రాజకీయం చేసి వెనక్కి నెట్టారని అన్నారు.
సూపర్ డీలక్స్ సినిమాను ఆస్కార్(Oscar) బరిలోకి దింపకుండా అన్యాయం చేశారని, ఆ సినిమాకి బదులు గల్లీ బాయ్(Galli Boy) సినిమాను ఆ రేసులో ఉంచారని అన్నాడు.
అప్పట్లో సెన్సేషన్ : It Created sensation
సూపర్ డీలక్స్ సినిమా లో సమంత(Samanta), రమ్య కృష్ణ(Ramya Krishna), ఫహద్ ఫాజిల్(Fahad Fazil), మిస్కిన్(Miskin) వంటి వారు ప్రధానపాత్రలు పోషించారు.
ఈ సినిమాలో సేతుపతి ఒక ట్రాన్స్ జండర్(Trans Gender) పాత్రను పోషించాడు. అతని కోసం ఎదురు చూసే కొడుకు ఉంటాడు. భావోద్వేగాల చుట్టూ అల్లికున్న కథ ఇది.
ఈ సినిమా చేసే సమయానికే సేతుపతి తమిళ్ లో మంచి క్రేజ్ ఉంది. అతనికంటూ ఒక స్టార్ డం ఏర్పడింది. అయినప్పటికీ పాత్ర డిమాండ్ మేరకు ఎంతమాత్రం సంకోచించకుండా ట్రాన్స్ జండర్ అవతారం ఎత్తాడు సేతుపతి.
ఆ సినిమా లో విజయ్ నటన చూసినవారు శభాష్ అని మెచ్చుకున్నారు. నటుడిగా ఎలాంటి పాత్ర చేయడానికైనా
వెనుకాడకూడదు అని సేతుపతి నిరూపించాడు అని ఫాన్స్ చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇలాంటి సినిమాను ఆస్కార్ బరిలో నిలిపితే ఖచ్చితంగా అవార్డు దక్కడం ఖాయమని అనుకున్నారు.
రాజకీయం జరిగిందంటూ సేతుపతి ఆవేదన : Sethupathi said politics has taken place
అయితే అనూహ్యంగా ఈ సినిమాను అసలు ఆస్కార్ ఎంట్రిలోకి తీసుకోకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. ఈ విషయాన్నీ స్వయంగా సేతుపతే చెప్పుకొచ్చాడు.
మేరీ క్రిస్మస్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ లో సేతుపతి సూపర్ డీలక్స్(Super Deluxe) కి సంబంధించ విషయాన్నీ మాట్లాడుతూ..తన ఆవేదనను వ్యక్తపరిచాడు.
ఇదంతా రాజకీయమని, అందుకే ఈ సినిమాను పక్కనపెట్టారని అన్నాడు. సూపర్ డీలక్స్ సినిమాలో తాను నటించి ఉండకపోయినా ఇదే తీరుగా స్పందించేవాడినని చెప్పాడు.
సూపర్ డీలక్స్ విషయంలో జరిగినదానికి తనకు సినిమా యూనిట్ కు చాలా బాధగా అనిపించిందన్నాడు. తనగుండె పగిలినంత బాధ కలిగిందన్నాడు.
ఏది ఏమైనా జరిగింది జారిపోయింది, ఇక దానిగురించి మాట్లాడి ప్రయోజనం లేదని, మాట్లాడాలని కూడా అనుకోవడం లేదని చెప్పాడు.