Vijay Varma: తమన్నాతో డేటింగ్ అప్పుడే మొదలైంది

WhatsApp Image 2024 03 26 at 10.59.36 AM 1 Vijay Varma: తమన్నాతో డేటింగ్ అప్పుడే మొదలైంది

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Thamanna Bhatia)బాలీవుడ్ లో వరుసగా ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సౌత్ లో ఈ బ్యూటీ ఫుల్ లెన్త్ సినిమాలు చేసి చాలా రోజులైంది. చివరిసారిగా ఈ భామ తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth)నటించిన జైలర్ (Jailer)సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించి దుమ్మురేపింది.

ఈ సాంగ్ దేశవ్యాప్తంగా ఎంతో ట్రెండ్ సెట్ చేసింది. ఇక రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమైన లస్ట్ స్టోరీస్ 2 లో బోల్డ్ సీన్లతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత తమన్నా తమిళంలో అరణ్మణై 4 (Arunmanai4), స్త్రీ 2 (stree)చిత్రాల్లో నటిస్తుంది. సినిమాల విషయం పక్కన పెడితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసింది. అయితే వీరి రిలీష్ ఎప్పుడు ఎక్కడ స్ట్రాంగ్ అయ్యింది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. తాజాగా వీరి డేటింగ్ గురించి విజయ్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

WhatsApp Image 2024 03 26 at 10.59.51 AM Vijay Varma: తమన్నాతో డేటింగ్ అప్పుడే మొదలైంది

అలా మొదలైంది :

గత కొంత కాలంగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో ప్రేమలో ఉంది. వీరిద్దరు కలిసి ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని మరీ షీకార్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్ కు , పార్టీస్ కు వెళుతూ సందడి చేస్తున్నారు. ఇక గతేడాది వీరిద్దరి లవ్ స్టోరీ బయటపడింది. మిల్కీ బ్యూటీనే స్వయంగా అఫీషియల్ గా వీరి రిలీషన్ గురించి అనౌన్స్ మెంట్ ఇచ్చింది. కానీ ఈ జోడీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

దీని గురించి కూడా ఆలోచించడం లేదు. ఎవరి పనుల్లో వారు చాలా బిజీ అయిపోయారు. అయితే దీంతో వీరిద్దరి పెళ్లెప్పుడు? అసలు చేసుకుంటారా ? అనే కామెంట్స్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ వర్మ తమన్నాతో డేటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories2) షూటింగ్ తర్వాతే తమన్నాతో డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చాడు.

తమన్నాకు అసలు విషయం చెప్పాను :

“లస్ట్ స్టోరీస్ 2 తర్వాతే మా ఇద్దరి మధ్య డేటింగ్ మొదలైంది. వాస్తవానికి ఆ టైంలో ర్యాప్ పార్టీ జరగాల్సింది. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. దీంతో మేము నలుగురం పార్టీ చేసుకున్నాము. ఆ సమయంలోనే తమన్నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను అని అసలు విషయం చెప్పాను. అయితే వెంటనే మేము డేటింగ్ మొదలుపెట్టలేదు…మేము కలవడానికి దాదాపు 25 రోజులు పట్టింది” అని తమ ప్రేమ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.

ఇక విజయ్ చివరగా మర్డర్ ముబారక్ (Murder Mubharak)సినిమాలో కనిపించాడు. ఇప్పుడు విజయ్ మట్కా కింగ్ (Matka King), మీర్జాపూర్ (Mirzapur)సీజన్ 3లో నటిస్తున్నాడు. ఇక తమన్నా తెలుగులో ఓదెల రైల్వే స్టేషన్ (Odela Railway station)సీక్వెల్ లో నటిస్తుంది. ఈ మూవీకి సంపత్ నంది స్టోరీ రాశాడు. ఈ మూవీలో తమన్నా అఘోరి క్యారెక్టర్ లో కనిపించనుందట.

Leave a Comment