NKR 21 Film: కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి.
2006 వ సంవత్సరంలో విజయశాంతి నాయుడమ్మ అనే సినిమాలో నటించారు, ఆతరువాత రాజకీయాలు, తెలంగాణ ఉద్యమం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
దాదాపు 14 సంవత్సరాల తరువాత విజయశాంతి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా మరో సారి మేకప్ వేసుకున్నారు. దాదాపు మూడేళ్ళ గాప్ తరువాత విజయశాంతి మరోమారు కెమెరా ముందుకి వచ్చారు.
కళ్యాణ్ రామ్ కొత్త సినిమా లో ఒక కీ రోల్ ప్లే చేయడానికి ఒకే అన్నారట. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రాములమ్మ కీలక పాత్ర పోషించారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాకి దర్శకత్వం వహించిన అనిల్ రావి పూడి విజయశాంతిని అంతకన్నా ముందే అప్రోచ్ అయ్యారు.
రవితేజ హీరోగా చేసిన రాజా ది గ్రేట్ సినిమా కోసం ఆమెను సంప్రదించారు. ఆ సినిమాలో రవితేజకు తల్లి పాత్ర పోషించాలని అడిగారట, కానీ విషయశాంతి ఆ పాత్ర నచ్చక వద్దన్నారో లేక వయసులో రవితేజకి తనకి పెద్దగా వ్యత్యాసం లేదు కాబట్టి తెరమీద చూడటానికి బాగోదు అని రిజెక్ట్ చేశారో తెలీదు కానీ మొత్తానికి రాజా ది గ్రేట్ కోసం మాత్రం రాములమ్మ కాల్షిట్స్ ఇవ్వలేదు.
కానీ డైరెక్టర్ అనిల్ రావిపూడి పట్టువదలని విక్రమార్కుడిలా విజయశాంతి వెంట పడ్డాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఆమె కోసం ఒక పవర్ ఫుల్ రోల్ క్రియేట్ చేశారు. దాంతో విజయశాంతికి నో చెప్పడానికి రీజన్ కనిపించక డేట్స్ ఇచ్చేశారు.
విజయశాంతి మహేష్ కి మదర్ రోల్ చేయడం ఇది తొలిసారి కాదు, సరిలేరు నీకెవ్వరూ కన్నా ముందే ఆమె కొడుకులు దిద్దిన కాపురం సినిమాలో ఆమె మహేష్ కి అమ్మ పాత్ర చేశారు.
అందులో మహేష్ డ్యూయెల్ రోల్ చేశారు. 1989 లో ఆ సినిమా రాగా 2020 లో సరిలేరు నీకెవ్వరూ సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య 31 సంవత్సరాల గాప్ వచ్చినప్పటికీ మహేష్, విసజయశాంతిల నటనలో ఎక్కడా మార్పు రాలేదు. ఇద్దరూ ఇద్దరే ఎక్కడ తగ్గకుండా చేశారు.
కళ్యాణ్ రామ్ ఈ మధ్య తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బింబిసార తరువాత ఆయన అమిగోస్ లో నటించారు. కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు ఈ సినిమాలో.
అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని కళ్యాణ్ రామ్ కి అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు చేస్తున్న సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టారు. పక్కా గా హిట్టు కొట్టాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఈ సినిమాలో ఉన్న ఒక ప్రత్యేక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించారట.
ఆమె అయితేనే ఆపాత్రకు న్యాయం చేయగలరని నమ్మి ఆమెను సంప్రదించారు. విజయశాంతికి కూడా స్టోరీ నచ్చడం, ఆమె పాత్ర నచ్చడం తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాములమ్మ బిజీ బిజీ గానే ఉన్నారు.
ఎలెక్షన్ ముందు వరకు కమలం పార్టీలో ఉన్న ఆమె సడన్ గా ఎలెక్షన్ టైం లో హస్తం పార్టీలోకి వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె సంతోషాన్ని కూడా వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఆమె ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే..
తన కెరియర్ బిగిన్ చేసిన నాటి నుండి అభిమానులు తన వెన్నంటే ఉన్నారని అందుకే వాళ్ళే తన దైవాలని చెప్పుకొచ్చారు. తన సినీ అభిమానుల కోసం తానూ మరో సినిమాలో నటిస్తున్నానని వెల్లడించారు.
1979 నుండి నేటి వరకు అభిమానుల పట్ల కృతజ్ఞత తోనే ఉన్నానని, ఇప్పుడే కాదు కళాకారిణిగా ఉన్నన్ని నాళ్ళు అదే కృతజ్ఞతా భావం ఫాన్స్ పట్ల ఉంటుందని పేర్కొన్నారు.