SALMAN KHAN: పందిలా తింటడు…కుక్కలా జిమ్ చేస్తాడు సల్మాన్‎పై షాకింగ్ కామెంట్స్

942a2614 beb7 4c5a 97b9 a3106dcf60e0 1 SALMAN KHAN: పందిలా తింటడు…కుక్కలా జిమ్ చేస్తాడు సల్మాన్‎పై షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లకు గ్లామర్ చాలా అవసరం. ఇండస్ట్రీలో రాణించాలన్నా, తోటి స్టార్ తో పోటీ పడాలన్నా ఫిట్‌పెస్ కచ్చితంగా మెయిన్ టైన్ చెయ్యాలి. అందుకే చాలా మంది హీరోయిన్లు, హీరోలు ఎక్కువ సమయాన్ని జిమ్ లకు కేటాయిస్తుంటారు. తమ గ్లామర్‌ను కాపాడుకోవడానికి చేయాల్సిన అన్ని కసరత్తులు చేస్తుంటారు.

పక్కాగా డైట్ ఫాలో అవుతూ కడుపు మాడ్చుకుంటుంటారు. బరువు పెరిగే ఆహారాల జోలికే వెళ్లరు. అంతల సెలబ్రెటీలు డైట్ ఫాలో అవుతారు. అయితే ఈ లిస్టులో మాత్రం బాలీవడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ఉండడు. అయితే స్టైలే వేరు. మిగతా స్టార్లకు పూర్తిగా విరుద్ధం ఉంటాయి ఈయన ఆహారపు అలవాట్లు. ఆయన ఎలా తింటాడు, వర్క్ అవుట్ ఎలా చేస్తాడు అనే విషయాలను తాజాగా సల్మాన్ ఫ్రెండ్ విందు దారా సింగ్ (Vindu Dara Singh) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తినడం, జిమ్ చేయడమే అతని పని :

సల్మాన్ ఖాన్(Salman Khan) , విందు దారా సింగ్ (Vindu Dara Singh) ఇద్దరూ మంచి స్నేహితులు. కాలేజ్ డేస్ నుంచే వీరు మంచి ఫ్రెండ్స్. అప్పట్లోనే విందు దారా సింగ్ బాడీ చాలా ఫిట్ గా ఉంటుంది. సల్మాన్ కూడా అతని కంటే మంచి బాడీ పొందాలని చాలా ప్రయత్నించేవారు. కడుపునిండా తినడంతో పాటు గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేసే వాడు. పుడ్, జిమ్ విషయంలో సల్లూ భాయ్ ఎట్టిపరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాడని తెలిపాడు.

” మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. చదువుతో పాటు బాడీ ఫిట్ నెస్ మీద నేను చాలా ఫోకస్ పెట్టేవాడిని. అప్పట్లోనే నాకు మంచి బాడీ ఉండేది. నన్ను చూసి సల్మాన్ కూడా తన బాడీని ఫిట్ గా మార్చుకోవాలనుకున్నాడు. నా కంటే ఎక్కువ సమయం జిమ్ లో గడిపేవాడు. పందిలాగా తినేవాడు, కుక్కలాగా జిమ్లో వర్కౌట్స్ చేసేవాడు. అదే పనిగా పెట్టుకున్నాడు సల్మాన్. అప్పట్లో సల్మాన్ ను చూసి చాలా ఓవర్ చేస్తున్నాడు అనిపించింది. అతడు ఆహారం తినే విధానాన్ని చూసి, అందంతా ఎక్కడికి పోతుంది? అని అడిగేవాణ్ణి. సాయంత్రం జిమ్ లో కాలిపోతుంది అని సల్మాన్ చెప్పేవాడు” అని విందు దారా సింగ్ తెలిపాడు.

సాయం కోసం వస్తే నో చెప్పడు :

“సల్మాన్ (Salman Khan)లాంటి మంచి వ్యక్తుుల కనిపించడం చాలా అరుదు. అతనంటే నాకు ఎంతో ఇష్టం. నేనే కాదు చాలా మందికి సల్మన్ చాలా ఇష్టం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సాయం చేసేందుకు వెనుకాడడు. ఎదురెళ్లి మరీ సాయం చేస్తాడు. అతడి తండ్రి ఇచ్చే పాకెట్ మనీని వారింట్లో పని చేసే వానిరి ఇచ్చేవాడు.

పాకెట్ మనీనే కాదు ఖర్చుల కోసం ఇచ్చే డబ్బును సల్మాన్‌ చాలా వరకు పేదలకు పంచేవాడు. ఇప్పటికీ సల్మాన్ అలాగే ఉన్నాడు. ఆయన ప్రతి నెల రూ. 25 నుంచి 30 లక్షలు రూపాయల వరకు దానంగా ఇచ్చేస్తాడు. అందుకే సల్మాన్ అంటే ఇష్టం. సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది.” అని విందు దారా సింగ్(Vindu Dara Singh) తెలిపారు.

Leave a Comment