Viral Samantha dubbing Citadel : ఖుషీ (Kushi) సినిమా తర్వాత సమంత (Samantha) రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది. సినిమాలకు గ్యాప్ ఇస్తున్నాని, సంవత్సరం పాటు యాక్టీవ్ గా ఉండనని అనౌన్స్ చేసి మయోసైటిస్
(myositis)కు ట్రీట్మెంట్ తీసుకుంటోంది.
అంతే కాదు ఇన్నాళ్లు సినిమా షూటింగ్ల పక్కన పెట్టిన తన పర్సనల్ బిజినెస్ లపైనప కూడా సమంత ఫోకస్ చేసింది. ఓ వైపు మయోసైటిస్కు ట్రీట్మెంట్ తీసుకోవడంతోపాటు మరోవైపు నచ్చిన ప్రదేశాలకు తన స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్తూ హాయిగా ఎంజాయ్ చేస్తోంది.
అయితే ఇదే సమయంలో సామ్ ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్టార్ట్ చేసింది. తన బిజినెస్‌లను ఓ గాడిలో పెట్టి సినిమాల వైపు చూడకుండా ఇన్నాళ్లు గడిపేసింది. ఇక లేటెస్టుగా మళ్లీ సమంత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యింది.
తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బ్యాక్ టు బ్యాక్ వర్కింగ్ పోస్టులను పెట్టి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తన అభిమానులకు చెబుతోంది. 22 నెలల తరువాత మళ్లీ ఇలా అంటూ పోస్ట్ పెట్టి అభిమానులను అలరిస్తోంది.
Samantha starts dubbing for Citadel : సిటాడెల్ డబ్బింగ్ స్టార్ట్ చేసిన సమంత
ప్రస్తుతం సమంత(Samantha) కొత్త సినిమాలేమీ సైన్ చేయలేదు. మయోసైటిక్ కు ముందే కొన్ని సినిమాలను ఒప్పుకుంది. అందులో యశోధ (Yashoda), శాకుంతలం (Shakuntalam), ఖుషీ (Kushi)సినిమాలను ఎదోలాగా పూర్తి చేసింది. కానీ ఈ భామ సైన్ చేసిన హిందీ ప్రాజెక్టుకు సీటాడెల్ (citadel)వర్క్ మాత్రం పెండింగ్ లో ఉంది.
రాజ్ అండ్ డీకే (Raj &DK) డైరెక్షన్ లో వరుణ్ ధావన్ (Varun Dhavan) కు జోడీగా సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. హాలీవుడ్ (Hollywood)లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra)చేసిన సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వర్షన్ లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
అయితే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఎంతలేదన్నా 2 ఏళ్ళు అయిపోయింది. దాదాపుగా సిరీస్ షూటింగ్ పూర్తైనా సమంత ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆ సిరీస్ అక్కడే ఆగిపోయింది. ఇక చానాళ్ల తర్వాత సిటాడెల్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది సమంత.
సిటాడెల్ కి డబ్బింగ్ చెప్తున్న అంటూ ఓ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది . ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టోరీతో పాటే సామ్ మరికొన్ని ఫోటోలను తన ప్రొఫైల్ లో షేర్ చేసింది. రాజ్ & డీకే టీంతో ల్యాప్‌టాప్‌లో సిటాడెల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న ఫోటోలని కూడా షేర్ చేసింది.
ఈ ఫోటోలని షేర్ చేస్తూ 22 నెలల తర్వాత సీటీడెల్ ప్రాజెక్టు రెడీ అయ్యిందని తన అభిమానులకు ఖుషీ కబర్ చెప్పింది సామ్. సామ్ గతంలో వీరి డైరెక్షన్ లో ఫ్యామిలీ మెన్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ కు మంచి హిట్ టాక్ వచ్చింది.
దీంతో ఇప్పుడు త్వరలో రిలీజ్ కానున్న సీటీడెల్ పైనే అదే స్థాయిలో ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. త్వరలోనే అమెజాన్ (Amazon)లో సమంత నటించిన సీటాడెల్ స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, రొమాంటిక్ సిరీస్ గా ఇది ఉండబోతోందని సమాచారం.