Virat & Shubman did Garba In Test Match: వెనకటికి ఆడపిల్లలు ఎదురు బెదురుగా కూర్చుని ఒకరి చేతులు ఒకరు లయబద్దంగా తాటిస్తూ చమ్మ చక్క చారడేసి మొగ్గ అంటూ ఆటలు ఆడుతూ ఉండేవారు.
ఇవి ముఖ్యంగా పల్లెటూరిలో ఎక్కువగా కనిపించేవి, సెలవు దొరికిందంటే చాలు ఆడపిల్లలంతా గుంపుగా చేరి ఆటపాటలతో సరదాగా గడిపేవారు.
ఇలా ఆదిపడుతున్నప్పుడు ఆడపిల్లల కేరింతలు, తుళ్ళింతలు చూడముచ్చటగా ఉండేవి. అయితే ఇదే చెమ్మచెక్కలాట సిక్రిటర్లు ఆడితే ఎలా ఉంటుందో చూడాలని ఉందా ?
ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఈ వీడియోచూసారా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), యువ ఆటగాడు శుభ్ మన్ గిల్(SubhMan Gill)
ఇద్దరు కలిసి చెమ్మచెక్కలాట ఎంత చక్కగా ఆడారో, ఈ వీడియో ఎక్కడిదో తెలుసా తాజాగాదక్షిణాఫ్రికా(South Africa), భారత్(India) జట్ల మధ్య టెస్ట్ సీరీస్(Test Series) జరుగుతోంది కదా ?
ఆ సమయంలోనే ఈ వినోద భరిత సన్నివేశం చోటుచేసుకుంది. కేప్ టౌన్(Cape town) లో జరుగుతున్న ఈ సీరీస్ లో రెండు మ్యాచ్ లు ఆడాలి భారత్ దక్షిణాఫ్రికా జట్లు.
అయితే మొదటి మ్యాచ్ ను దక్షిణాఫ్రికా గెలవగా, రెండవ మ్యాచ్ ను భారత్ కైవశం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయం లోనిదే దృశ్యం.
ఈ ఇద్దరు ఆటగాళ్లు సరదాగా చేతులు పెట్టుకుని గెంతుతూ ఉండగా కెమెరాకి చిక్కారు. దేన్తి ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా(Viral Video) మారింది.
ఇది చుసిన కోహ్లీ, గిల్ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. జట్టులోని మేటి ఆటగాల్లిద్దరు వారి హోదాను, వారున్న ప్రదేశాన్ని కూడా గుర్తించకుండా, ఇంత సరదాగా గడపడంపై కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు