థ్యాంక్యూ ఎన్టీఆర్‌ అన్న దేవరపై విశ్వక్ క్రేజీ అప్‌డేట్‌

website 6tvnews template 2024 04 04T124210.791 థ్యాంక్యూ ఎన్టీఆర్‌ అన్న దేవరపై విశ్వక్ క్రేజీ అప్‌డేట్‌

Vishwak sen gave solid update on Devara Music : ప్రస్తుతం యంగర్ టైగర్ ఎన్టీఆర్(NTR)నటిస్తున్న దేవర (Devara)మూవీ గురించి ఏ చిన్న అప్‎డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఈ సినిమా విషయాలను తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికీ విడుదలైన స్టార్స్ లుక్స్ , టీజర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. యాక్షన్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా దేవర ఉండబోతుంది. ఈ మధ్యనే గోవా(Goa)లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది. గోవా బీచ్ లో జరిగిన షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొన్న వీడియో ఈ మధ్యనే నెట్టింట్లో హల్ చల్ చేసింది. గోవాలో ఎన్టీఆర్‌,బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)పై ఓ పాటతో పాటు ఫైట్ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా ఈ మూవీ గురించి టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen)ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈసారి మ్యూజిక్ మామూలుగా ఉండదని ‘దేవర’పై సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోను ఈ పోస్టుకు జోడించాడు. దీంతో ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అనిరుధ్ అదరగొట్టాడు :

ఎన్టీఆర్‌ (NTR) ఫ్యామిలీ మ్యాన్ . సినిమాలు, లేదంటే ఫ్యామిలీతోనే ఎక్కువగా సమయం గడుపుతాడు. ఎన్టీఆర్ చాలా రేర్ గా బయటికి వచ్చే మనిషి. అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్లో అతిథిగా అలా మెరుస్తుంటారు. లేదంటే ఫారెన్ ట్రిప్ కు వెళ్లేప్పుడు ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తారు. కానీ ఇప్పుడు ఈ యంగ్ టైగర్, యంగ్‌ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయడానికి ముందుకువచ్చారు. తనని అభిమానించే వారికి తన సపోర్ట్ అందిస్తున్నాడు.

లేటెస్టుగా ‘మాస్‌ కా దాస్‌’ విశ్వక్‌ సేన్‌ (Vishwak sen)ఎన్టీఆర్‌ ను కలిశాడు. తారక్‌, విశ్వక్‌ని గట్టిగా హగ్‌ చేసుకున్న ఫోటోను విశ్వక్ తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేశాడు. దేవర(Devara) మ్యూజిక్ గురించి లేటెస్ట్ అప్డేట్ అందించాడు. ‘దేవర’ మ్యూజిక్‌ అద్భుతం అంటూ సోషల్ మీడియాలో సాలిడ్ అప్‌డేట్‌ వదిలాడు. “థ్యాంక్యూ ఎన్టీఆర్‌ అన్న.

దేవర మ్యూజిక్‌ ఉందమ్మా..వేరే లెవల్‌. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌ (Anirudh)అదరగొట్టాడు. దేవర అల్భం పిచ్చేక్కిస్తుందంతే” అని క్యాప్షన్ జోడించాడు. విశ్వక్‌ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. ఈ న్యూస్ చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

దసరాకు దుమ్ముదులుపుడు ఖాయం :

దేవర(Devara)ను ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ దేవర దసరాకు థియేటర్లలో సందడి చేయనుంది.

అక్టోబర్‌ 10న లాంగ్‌ వీకెండ్‌ కావడంతో ఈ సినిమాకు మరింత ప్లస్‌ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్(NTR) సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram)ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapor) తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ మూవీలో ప్రతికథానాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ (Saif Ali Khan)అలీ ఖాన్‌ నటిస్తున్నాడు.

Leave a Comment