సంక్రాంతి కనుక :
మెగా స్టార్ నుంచి రాబోయే 156వ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులు గా చిరంజీవి 156వ సినిమా సంక్రాంతి కానుకగా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టుగా తెలిపారు.
గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్టు కొట్టిన మెగా స్టార్, ఈ ఏడాది సంక్రాంతికి సినిమా పేరుని బయటపెట్టారు.
VISHWAMBHARA Trailer :
చిత్ర బృందం :
- దర్శకత్వం – వసిష్ట
- ప్రొడ్యూసర్ – వి వంశీ కృష్ణా రెడ్డి
- ప్రమోద్ ఉప్పలపాటి
- విక్రమ్ రెడ్డి
- ప్రధాన పాత్రధారులు – మెగా స్టార్ చిరంజీవి
- సినిమాటోగ్రఫీ – ఛోటా కె నాయుడు
- ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
- సంతోష్ కామిరెడ్డి
- సంగీతం – ఎంఎం కీరవాణి
- ప్రొడక్షన్ హౌస్ – యువి క్రియేషన్స్
- విడుదల తారీఖు – 2025
- దేశం – భారతదేశం
- భాష – తెలుగు
విశ్వంభర:
చిరంజీవి సినీకెరీర్ లో రానున్న 156 వ సినిమా విశ్వంభర.
ఈ సినిమా వశిష్ట దర్శకత్వంలో రానున్న ఒక ఫాంటసీ చిత్రం.
ఈ చిత్రం UV క్రియేషన్స్ బ్యానర్ పైన వంశీ కృష్ణ మరియు ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు సమాచారం.
విశ్వంభర గ్లింప్స్ :
సంక్రాంతి పండుగ సంధర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ సినిమా విశ్వం మరియు ఖగోళ లోకాలను అతీతంగా పరశీలించి అంతుచిక్కని కథని విప్పే అంశం పై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా గ్లింప్స్ అంచనాలని ఒక్కసారిగా పెంచేశాయి.
VFX, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.