Vishwambhara release date: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్…‘విశ్వంభర’వచ్చేది ఆరోజే

Vishwambhara release date

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటిస్తోన్న 156వ చిత్రం విశ్వంభర (Vishwambhara).బింబిసారా (Bimbisara) ఫేమ్ డైరెక్టర్ వశిష్ట (Vasishta) డైరెక్షన్ లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. గతంలో చిరంజీవి నటించిన రెండు సినిమాలు వాల్తేరు వీరయ్య (Walthair Veerayya), భోళాశంకర్ (Bhola Shankar)బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో ఈసారి పవర్ ఫుల్ కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలన్న కసితో నిన్ననే చిరంజీవి జిమ్ లో భారీ కసరత్తులు స్టార్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా చిరు షేర్ చేసిన ఈ వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా విశ్వంభరకు సంభందించి మరో అప్‎డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. విశ్వంభర మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి గిఫ్ట్ గా జనవరి 10న విశ్వంభరను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అంతే కాదు ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్‌ అవతరిస్తారు’అంటూ చిరంజీవి కటౌట్ తో ఉన్న పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ప్రస్తుతం విశ్వంభర్ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి ఉంది.

Vishwambhara release date

Non-stop schedule for 14 days : 14 రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్

సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న సినిమా విశ్వంభర (Vishwambhara). వశిష్ట (Vasishta)డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్యనే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

అయితే షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొనలేదు. ఇక ‘విశ్వంభర’ సెట్స్ లో ఎంటర్ అయ్యేందుకు మెగాస్టార్ సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి షూటింగ్ లో పాల్గొననున్నారు. సుమారు 14 రోజుల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ ఉండబోతోందని తెలుస్తోంది.

ఇందుకోసం హైదరాబాదులోని ఓ భారీ సెట్టింగ్ వేశారట. ఇదే షెడ్యూల్లో స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) కూడా జాయిన్ అవుతుందని ఇన్ఫర్మేషన్. అయితే నిజానికి విశ్వంభరలో ముందుగా అనుష్క (Anushka)ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ త్రిషను ఫైనల్ చేశారు. త్రిష్ కూడా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉంది. సౌత్ లో ఈ బ్యూటీకి మంచి డిమాండ్ పెరిగింది. మరో వారంలో త్రిష్ షూటింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది.

ఇదే షెడ్యూల్ లో త్రిష, చిరంజీవికి మధ్య కీలకమైన సీన్స్ షూట్ చేయబోతున్నారట. చిరు, త్రిషల కాంబినేషన్ లో గతంలో స్టాలిన్ (Stalin) సినిమా వచ్చింది. ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద బాగా పండింది. ఆ మూవీ తర్వాత మళరోసారి త్రిష, చిరు విశ్వంభరలో కలిసి నటించనున్నారు.

Vishwambhara budget rs 200 crores: రూ.200 కోట్ల బడ్జెట్‎తో రూపొందుతున్న విశ్వంభర

ఈ ప్రతిష్టాత్మకమైన ప్రజెక్ట్ UV క్రియేషన్స్ (UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు స్టార్ట్ చేసిన మేకర్స్ ప్రమోషన్ ను కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. తాజాగా జనవరి 10న సంక్రాంతి కానుకగా విశ్వంభర (Vishwambhara)రిలీజ్ అవుతుందని ట్విటర్ వేదకగా ప్రకటన కూడా చేశారు.

సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసేందుకు పవర్ ఫుల్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయట. ఆర్ఆర్ఆర్(RRR) తో ఆస్కార్ సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM.Keeravani)ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు (Chota K Naidu) సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల (Sushmita Konidela) ఉండనున్నారు. ఇప్పటికే చిరంజీవి జిమ్ వీడియోతో పాటు అనేక వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a Comment