Vivek Ramaswamy :అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఊహించని మలుపు

website 6tvnews template 29 Vivek Ramaswamy :అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఊహించని మలుపు

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగిన వివేక్ :

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అనూహ్యంగా ఈ పొరులో నుంచి ప్రముఖ వ్యాపార్ద్రవేత్త వివేక్ రామస్వామి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు.

ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం తొలి పోరు అయిన అయోవా ఫ్రైమరీ పోరులో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయిన కారణంగా వివేక్ రామస్వామి ఇటువంటి ప్రకటన చేశారు.

ఓటింగ్ ఫలితాల అనంతరం ప్రకటన :

అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున అయోవా కాకసస్ లో ఈ తొలిపోరు జరిగింది. ఈ పోరులో మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 51 శాతం ఓటింగ్ తో ఘన విజయం సాధించగా, వివేక్ కేవలం 7.7 శాతం ఓటింగ్ తో కుప్పకూలారు.

ఈ కారణంగానే ‘మేం ఆశించిన ఫలితాలను సాధించలేపోయామని భావిస్తున్నాను. మా ప్రచారాన్ని నిలిపివేస్తున్నాం. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు నాకు మార్గం లేదు’
అని ఫలితాలు వచ్చిన తరువాత వివేక్ తన మద్దతుదారులతో మాట్లాడుతూ చెప్పాడు.

tz9gpynspusfpvuhtfaqea Vivek Ramaswamy :అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఊహించని మలుపు

వివేక్ రాజకీయ తెరంగరేటం :

ఇక వివేక్ విషయానికి వస్తే గత ఏడాది వరకు ఇతని పేరు ఎవరికి తెలియదు.
రాజకీయంగా ఎటువంటి గుర్తింపు లేని వివేక్ గత ఏడాది ఫిబ్రవరి లో రేసులో దిగాడు, అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి, అందరి దృష్టిని ఆకర్షించారు.

వివేక్ పై ట్రంప్ విమర్శలు :

మొదటి నుంచి మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలనే అనుసరిస్తున్న వివేక్, ప్రచారంలో కూడా అదే శైలిని పాటించాడు.

మొదటి పోరు ముందు వరకు ఒకరి పై ఒకరు ప్రశంసలు కురిపించున్న ట్రంప్, మరియు వివేక్ లు ఒక్కసారిగా శత్రువులుగా వ్యవహరించారు. ఇటీవల వివేక్ ని విమర్శిస్తూ ట్రంప్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశాడు.

Leave a Comment