Vyuham Movie Postpone Again : సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన సినిమా వ్యూహం(Vyuham), రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను వర్మ రూపొందించాడు.
ఒక రకంగా ఇది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) బైయోపిక్ వంటిది. అంటే ఆ సినిమాలో తప్పకుండ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వై.
ఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) ప్రస్తావన ఎంత ఖచ్చితంగా ఉంది తీరుతుందో అంతకన్నా ఖచ్చితంగా మాజీ ముఖ్య మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandra Babu Naidu) గురించి కూడా ఉంది తీరుతుంది.
ఈ సినిమాను రామ దూత క్రియేషన్స్ బ్యానర్ మీద దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే విడుదలైంది. ట్రైలర్ లోనే చంద్రబాబు ను ఆర్జీవీ ఏకి పారేశాడు. దీంతో టీడీపీ శ్రేణులు ఆర్జీవీ పై నిప్పులు చెరిగారు.
ఇక ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఈ సినిమా విషయం లో తెలంగాణ హైకోర్టు(Telangan Hi Court) ను ఆశ్రయించారు.
ఆర్జీవీకి ఈ సారీ ఆశాభంగమే : Shocking Incident For RGV
వ్యూహం సినిమాలో చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చే విధంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని, లోకేష్ ఆరోపించారు. ఈ సినిమా కి సిబిఎఫ్ సి సర్టిఫికెట్ ఇవ్వడాన్ని అయన సవాల్ చేశారు. ఈ క్రమం లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది.
ఈ సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్(Censor Cirtificate) ను రద్దు చేస్తునట్టు వెల్లడించింది. అంతే కాకుండా ఈ వ్యూహం సినిమాను ఇంకొకసారి రివ్యూ చేయాలనీ ఆడేసించింది. రివ్యూ కమిటీ వారి నివేదికను మూడు వారాల్లోగా హై కోర్ట్ లో సబ్మిట్ చేయాలనీ చెప్పింది.
కాగా వ్యూహం సినిమాను అటు వైసీపీ(YSR Congress Party) పార్టీ తోపాటు రామ్ గోపాల్ వర్మ కూడా చాలా ప్రస్టిజియస్ గా తీసుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడ(Vijayawada) లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
ఆ కార్యక్రమంలో వైసీపీ కి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. తీరా సినిమా విడుదల కావడంలో అవరోధాలు ఎదురవ్వడం వారికి మింగుడు పడనీ అంశంగా మారింది.
అంతే కాక ఆంధ్ర ప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల పై ఈ సినిమా ప్రభావం చూపుతుంది అనుకుంటే దీనిని తెలంగాణ లో విడుదల చేసుకునే వీలు కల్పించాలని నిర్మాత తరుపు న్యాయవాది కోరగా ఆ ప్రతిపాదనను లోకేష్ తరుపు న్యాయవాది నిరాకరించారు.