Govt job With out exams: పరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలా? ఈ సమాచారం మీ కోసమే.

Want Govt Jobs Without Exams

Govt job With out exams: పరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలా? ఈ సమాచారం మీ కోసమే.

దేశం వ్యాప్తంగా ఈ ఉద్యోగం కావాలాన్నా తప్పకుండా ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సిందే. ఈ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు వెలలోనే కాదు.. లక్షల సంఖ్యలో వుంటారు.

ఈ పోటీలో నెగ్గి, పరీక్షలు పాస్ కావాలంటే కత్తి మీద సాము లాంటి పనే. కానీ, కొన్ని సంస్థలలో అస్సలు ఈ ఎంట్రెన్స్ పరీక్షల గొడవే ఉండదు. అలాంటి సంస్థలకు చెందిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మీరు ప్రైవేటు సంస్థలో ఉన్నత ఉద్యోగులైనా సరే ఎలాంటి పోటీపరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందాలని అనుకుంంటే చాలు. ఈ సమాచారం మీకోసమే..

అయితే, ఇలాంటి ఉద్యోగాలు పొందాలంటే కేవలం ప్రైవేటు సంస్థలో వృత్తి నిపుణులుగా ఉద్యోగం చేసిన అనుభవం ఉంటే చాలు, ప్రభుత్వ కొలువు సాధించవచ్చు. ఆ ఉద్యోగాలు ఏమిటో, వారిని ఎవరు నియమిస్తారో తెలుసుకుందాం.

నీతి అయోగ్ లో ఉద్యోగం :​ కన్సల్టెంట్ & సీనియర్ కన్సల్టెంట్


నీతి అయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక విధాన కమిటీ. ఇది పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలను రచిస్తుంది.

ప్రభుత్వ పథకాలు సరిగా అమలు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షిస్తుంది. ఈ పనుల కోసం ఆయా రంగాల్లో విశేష అనుభవం ఉన్నవారిని కన్సల్టెంట్​, సీనియర్​ కన్సల్టెంట్​లుగా నియమించుకుంటుంది.

వీరు పథకాల అమలును పర్యవేక్షించాలి. మేజర్ ప్రోజెక్టుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే కలసి పనిచేయాల్సి ఉంటుంది.

ఇన్వెస్ట్ ఇండియా ఉద్యోగం : ఇన్వెస్ట్​మెంట్ అసోసియేట్


ఇన్వెస్ట్ ఇండియా అనేది నేషనల్ ఇన్వెస్ట్​మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ. ఈ సంస్థ భారత్​లో పెట్టుబడి అవకాశాల కోసం అన్వేషిస్తున్నవారికి దేశంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు సహాయ పడుతుంది.

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్​మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వాణిజ్య మంత్రిత్వశాఖలతో ఈ సంస్థ పనిచేస్తుంది.

ఈ సంస్థ ఇన్వెస్ట్​మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు సమాయానుకూలంగా ప్రకటనలు వెలువరిస్తుంది. వివిధ రాష్ట్రప్రభుత్వాలను సమన్వయం చేస్తూ ఇన్వెస్ట్​మెంట్​లను పెంచడమే ఈ జాబ్​ రోల్ ముఖ్య ఉద్దేశం.

విదేశీ వ్యవహారాల శాఖ ఉద్యోగం : కన్సల్టెంట్​


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కన్సల్టెంట్ ఉద్యోగులను నియమించుకుంటూ ఉంటుంది. జీ20 లాంటి వివిధ ప్రాజెక్టులకు కన్సల్టెంట్​ నియామకాలు చేపడుతుంటారు.

మూడు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారు భారత దౌత్య అధికారుల ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుంది.

2015 నుంచి ఈ నియమాకాలు చేపడుతున్నారు. ఈ కన్సల్టెంట్లు వివిధ ప్రాంతాలకు సంబంధించి రీసెర్చ్ పేపర్స్​ను స్టడీ చేయాల్సి ఉంటుంది.

అలాగే అంతర్జాతీయ సెమినార్లకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నిటికి ఎలాంటి పోటీ పరీక్షలు నిర్వహించరు. కేవలం అంతకు ముందు ఉన్న ఉద్యోగ అనుభవాన్ని, మేధస్సును పరిగణనలోకి తీసుకుని, వారికి ఆ ఉద్యోగ బాధ్యతలను వారికి అప్పగిస్తారు.

Leave a Comment