బ్యాంకులో కావాలా – LIC కావాల – రైల్వేస్ కావాలా – దుబాయ్ లో ఉద్యోగాలు కావాలా !

634ba2b1 0a55 418c a15b fccb123e8e35 బ్యాంకులో కావాలా - LIC కావాల - రైల్వేస్ కావాలా - దుబాయ్ లో ఉద్యోగాలు కావాలా !

అదేదో సినిమాలో చెప్పినట్లు జింక్ లో కావాలా బంకు లో కావాలా దుబాయ్ లో టోపీ పెట్టుకునే జాబ్ కావాలా అని అడిగి మోసం చేసినట్లు ఇప్పుడు కుడా అలాంటిదే ఒక ఘటన జరిగింది. గవర్నమెంట్ లో పలు శాఖ లకు సంబందించిన ఉద్యోగాలు ఉన్నాయిన మా పరపతి ఉపయోగించి జాబ్ లు ఇప్పించగలమని నిరుద్యోగులను నమ్మించారు.

అంతే కాదు దుబాయ్ లో అయితే లక్షలలో జీతాలు ఉంటాయని ఆశ చూపి లక్షలు వాసులు చేసి బోర్డు తిప్పెసారు మోసగాళ్ళు. తాము మోసగాళ్ళ చేతి లో మోసపోయామని గుర్తించి ఇప్పుడు లబోదిబో అంటున్నారు. ఇప్పడు వివారాల లోకి వెళ్తే విజయనగరం జిల్లా చోటుచేసుకున్న ఈ ఘారానా మోసం జిల్లాల లోని సంచలనం గా మారిపోయింది. వియయనగరం లో లైఫ్ లైన్ ట్రావెల్ ఏజన్సీ అనే ఒక కార్యాలయం ఉంది. ఇది ఇండియా లోనే కాక విదేశాలలో కూడా జాబ్స్ చూపించగలమని ఉద్యోగ ప్రకటనలతో హోరెత్తించారు.

మా ద్వార గవర్నమెంట్ జాబ్ లు తెచ్చుకున్నవారు ఎంతో మంది ఉన్నారని నమ్మించారు. ముఖ్యంగా వీరు ఆంద్ర ఒరిస్సా ప్రాంతాల బోర్డర్ లో ఉండే అమాయక గిరిజన యువతను టార్గెట్ చేసినట్లు చెప్పారు. వీరి మాయ మాటలు నమ్మిన 123 మంది యువకులు విదేశాలలో ఉద్యోగాల కోసం వీరిని కలిసారు. వీరిని పంపడానికి కొన్ని పత్రాలు అవసరం అవుతాయని దానికోసం కొంత డబ్బు చెల్లించాలని వారు చెప్పారు.

దీంతో ఆ యువకులు ఒక్కక్కరు 65 వేల రూపాయల చొప్పున వారికి ఇచ్చారు. వారికీ ఒక డేట్ చెప్పి ఆరోజుకి మా ఆఫీస్ వచ్చినట్లయితే అందరిని ఒకేసారు విమానం లో అబుదాబి కి తీసుకెళ్తామని వారిని నమ్మించారు. వారు అనుకున్న డేట్ కి అందరు యువకులు ఆఫీస్ రాగానే ఆఫీస్ కి ఉన్న బోర్డ్ తీసేసి మెయిన్ గెట్ కి తాళం వేసి ఉండడం తో వారు ఆఫీస్ వారికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందని దాంతో వారు అందరు మోసపోయామని గ్రహించి పోలీసులు కి జరిగినది అంతా చెప్పారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించాలని వారు పోలీసులను కోరారు.

Leave a Comment