హైదరాబాద్ లో ప్రారంభ మైన నీటి కష్టాలు – ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

truck mounted water tanker హైదరాబాద్ లో ప్రారంభ మైన నీటి కష్టాలు - ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

హైదరాబాద్ నగర పరిధిలో భూగర్భ జల మట్టాలు ప్రమాద స్దాయికి పడిపోవడంతో, అలాగే అనేక విద్యుత్ బోర్లు ఎండిపోవడంతో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నగర ప్రజలకు సక్రమంగా నీటిని సరఫరా చేయలేకపోతోంది. అంతే కాకుండా ఇప్పటికి కొన్ని చోట్ల జంటనగరాల్లో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ కూడా పెరిగింది. వేసవి కాలం దృష్ట్యా రానున్న మూడు నెలల్లో పగటి ఉష్ణోగ్రతలు 43-45 డిగ్రీలు వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య వేసవి కాలం కావడం వల్ల వేళ ఈ ట్యాంకర్ల సంఖ్య పెరుగుతుందని మెట్రో వాటర్ అధికారులు చెప్పారు.

ఈ ఏడాది బోరుబావులు ఎండిపోవడం వలన ఫిబ్రవరి మూడో వారం నుంచే నగరంలో ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది అని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు చెప్పారు. హిమాయత్సాగర్, సింగూరు, నాగార్జునసాగర్, ఎల్లంపల్లి (గోదావరి)లో నీటిమట్టం దాదాపు అడుగింటడం పోవడం ఆందోళనకు గురి చేస్తోందని అధికారులు చెప్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు లో 580 వాటర్ ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి అధికారులు చెప్తున్నారు. ఈ వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట ప్రైవేటు ట్యాంకర్లను జలమండలి అద్దెకు తీసుకోనుందని అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. ఇక వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను కూడా బోర్డు పెంచదానికి ప్రయత్నిస్తోంది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో రెండు షిఫ్టులు ప్రకారం నీటిని అందించడానికి పనిచేస్తున్నాయని బోర్డు అధికారులు చెప్పారు.

హైదరాబాద్ నగర ప్రజలు తమ ఇతర అవసరాల కోసం తప్పక భూగర్భ జలాలపై ఆధారపడడం తప్పనిసరి అని అధికారులు చెప్పారు. ఇప్పటికి నగరం లో ఉన్న ఇళ్లు, అపార్ట్ మెంట్స్, విల్లాల్లో సరైన నీరు లేక చాల ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టి కి వచ్చిందని అధికారులు చెప్పారు.

అదేవిధంగా నగరం లోనే కాక ఇతర ప్రాంతాలలో ఉండే కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, వాణిజ్య సంస్థలు లాంటివి కూడా తమ అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది అని అధికారులు చెప్పారు. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నగరం లో వాటర్ సప్లయ్ కోసం డొమెస్టిక్ ట్యాంకర్ కి ధర 5 వేల లీటర్ల నీటికి రూ.500, అదే వాణిజ్య అవసరాల కోసం ట్యాంకర్ కు రూ.850 లు ధరలు ఈ విధం గా ఉన్నాయి. అదే విధం ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు అయితే రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నాయని అధికారులు చెప్పారు.

Leave a Comment