ఎలక్టోరల్ బాండ్ల పై మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి – అమిత్ షా

Screenshot 2024 03 16 135327 ఎలక్టోరల్ బాండ్ల పై మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి - అమిత్ షా

ప్రస్తుత తరుణం లో రాజకీయాలలో డబ్బు ఖర్చుపెట్టడం అనేది మితి మీరిన వేళ కేంద్ర ఈ ఎలక్టోరల్ బాండ్ల పద్ధతిని తీసుకొచ్చింది. దీని వల్ల నల్ల ధనాన్ని అరికట్టవచ్చు అని భావించే ఈ పధకాన్ని తీసుకొచ్చామని ఈ విషయం లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మేము తప్పకుండా గౌరవిస్తామని అమిత్ షా చెప్పారు. దీనిని పూర్తి గా రద్దు చేసేబదులు అటు ఇటు గా మార్చి తీసుకురావడానికి అవకాశం ఇస్తే బావుండేది అని ఆయన తన మనసులో ఉన్న అభిప్రాయం తెలియజేసారు. ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీం అనేది ఓ రకమైన కుంభ కోణం అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి హోమ్ మంత్రి అమిత్ షా చెప్తూ ఈ పధకం లో మా పార్టీ లో సబ్యులు కుడా లభ్ది పొందారని ఆరోపణలు చేసారు.

అసలు మొత్తం దీని విలువ 20 వేల కోట్ల బాండ్లు లో BJP కి 6 వేల కోట్ల వరకు మాత్రమే వచ్చాయని ఆయన చెప్పారు, మిగిలిన నిధులు ఎం అయ్యాయనే ప్రశ్నకు సమాధాన మిస్తూ TMC కి 1600 కోట్లు, కాంగ్రెస్ కు 1400 కోట్లు ఇక మిగిలిన ఇతర పార్టీ లకు అందాయని దీనికి సంబందించి అన్ని లెక్కలు మా వద్ద ఉన్నాయి అని ఆయన ఘాటు గా స్పందించారు.

ఇంకా చెప్పాలంటే పార్లమెంట్ లో మా సబ్యుల సంఖ్య 303 మంది ఉన్నారని వీరి నుండి వచ్చినది 6 వేల కోట్లు అని, కాంగ్రేస్ సబ్యుల సంఖ్య 242 మంది ఉంటె వీరి పార్టీ నుండి వచ్చిన నిధులు 14 వేలకోట్లు అని ఆయన లెక్కలు చెప్పారు. ఈ వివరాలు అన్ని తేలితే ప్రతి పక్ష సబ్యులు తమ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ఆయన అన్నారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఆయన మొత్తం వివరించారు. ఈ బాండ్లు వల్ల నగదు నేరుగా దాతల అకౌంట్ నుండి పార్టీ అకౌంట్ కి వెళ్తుంది అని, అందులో కూడా చాల మోసాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు, ఎలాగంటె ఎవరైనా 1100 నగదు పంపితే అందులో కేవలం 100 రూపాయలు పార్టీ అకౌంట్ వెళ్తే మిగిలిన డబ్బులు సబ్యుల జేబుల్లోకి వెళ్తుందని ఇలా కొన్నేళ్ళ నుండి జరుగుతోందని ఆయన విమర్శించారు.

Leave a Comment