దేవాలయంలో మనం ఇతరులకు నమస్కారం చెయ్యకూడదు – అలా చేస్తే ?

website 6tvnews template 2024 04 01T140328.713 దేవాలయంలో మనం ఇతరులకు నమస్కారం చెయ్యకూడదు - అలా చేస్తే ?

మనం దేవాలయాల్లో అడుగుపెట్టిన తర్వాత మనకు అక్కడ ఎలాంటి పద్ధతులు పాటించాలి, అలాగే దేవుడిని ఎలా పూజించాలనే విషయాలను పండితులు, పెద్దలు, పూజారులు అడిగి తెల్సుకోవాలి అంటున్నారు పెద్దలు. దేవాలయాల్లో ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలి ఇలాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం! మనం ఆలయం లోకి ప్రవేశించిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం గా కడుగుకుని అప్పుడు ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాతే గుడి లోపలికి ప్రవేశించాలి. ఆలయంలో లోపలికి వెళ్ళిన తర్వాత టోపీ కాని తలపాగా కానీ పెట్టుకుని వెళ్లకూడదు.

మనం ఆలయంలోకి ఒట్టి చేతులతో వెళ్ళకుండా పువ్వులు పళ్ళు తీసుకుని వెళ్ళాలి. తప్పని సరిగా కుంకుమ బొట్టు పెట్టుకోకుండా గాని, తాంబూలం వేసుకుని లేదా చిరుతిళ్ళు తింటూ కాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించకూడదు. మనలో కొంత మంది ఆలయం లోకి అడుగు పెట్టగానే దర్శనం చేసుకుని తర్వాత గోడలకు ఆనుకుని నిద్రపోవడం, కాళ్లు చాపుకుని కూర్చోవడం వంటి పనులను అస్సలు చెయ్యకూడదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన ఇలాంటి పనులు చెయ్యకూడదు.

అలా చేస్తే పాపం తో పటు పలు రకాల దోషాలు వస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఉండే ఏ జీవికీ ఎటువంటి హాని కలిగించడం కాని లేదా హింసించడం కాని చెయ్యకూడదు. మనం ఆలయం లోకి వెళ్ళిన తర్వాత మనకు కొంత మంది గిట్టని వారు శత్రువు లా బావించే వారు కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎవ్వరితోను గొడవలు కాని వాగ్వివాదం కాని అంటే ఆర్గ్యుమెంట్ లు పెట్టుకోవడం కాని చెయ్యకూడదు. అలాగే మనకు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు అలాంటి వారి మీద నిందలు వెయ్యడం కాని వారిని చూసి కామెంట్లు కాని చెయ్యకూడదు.

అలాగే అహంకారం తోను , గర్వంతోను , అధికార దర్పంతోను అస్సలు ప్రవర్తించకూడదు. దేవుని ఎదురుగా ఉన్నప్పుడు అవతలి వ్యక్తులును పొగడడం కూడా చెయ్యకూడదు. అంతే కాకుండా చాలా మంది ఒకే చేతితో నమస్కారం చెయ్యడం చూస్తూ ఉంటాం అలా ఎప్పటికి చెయ్యకండి. దాని వల్ల ఎన్నో దోషాలు ఏర్పడతాయి. ఆలయాల్లో మనకు కనిపించే వారికి నమస్కారం చేయకూడదు, మనం చేసే నమస్కారం ఆ దేవుడికి చెందాలి తప్ప అన్యులకు చెయ్యకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు అందరూ సమానులే అని భావించాలి కాని పేద గోప్ప అనే భావం కనిపించకూడదు.

Leave a Comment