Wedding at YSRTP Sharmila House: వైఎస్ఆర్టిపి షర్మిళ ఇంట్లో పెళ్లి బాజా..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్ఆర్టిపి కార్యకర్త షర్మిలా ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలుకానున్నాయి. షర్మిలా కొడుకు వైఎస్ రాజా రెడ్డి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.
ఈ విషయాన్ని ఇతనే స్వయంగా ప్రకటించాడు. వైఎస్ రాజా రెడ్డి కి కాబోయే భార్య, వైఎస్ శర్మిలకి కాబోయే కోడలు ఎవరో కాదు, ప్రియా అట్లూరి.
ఈమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువతి. ఈమె కొన్నేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటోంది. అయితే ఈమెకి అమెరికా పౌరసత్వం కూడా ఉంది.
వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదువుకోవడానికి అమెరికా వెళ్ళిన రాజా రెడ్డి అక్కడే ప్రియ అట్లూరిని కలిశాడు.
మంచి స్నేహితులుగా ఉన్న వీళ్ళు గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.కులాంతర వివాహం అయినప్పటికీ ఇరు వైపులా కుటుంబ సభ్యులని ఒప్పించుకున్నారు ఈ జంట.
ఇక ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. అమ్మాయి కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, షర్మిలా ఢీ కూడా కులాంతర వివాహమే కబట్టి వాల్ల కుటుంబ సభ్యులు తొందరగానే పచ్చ జెండా ఉపేశారు.
అమెరికాలో రాజా రెడ్డి డల్లాస్ యూనివర్సిటీలో బాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేసి అక్కడి నుంచి డిగ్రీ పొందాడు.