West Indies Sensational Victory On Australia: ఆస్ట్రేలియా(Australia) గడ్డపై వెస్టిండీస్(West Indies) జట్టు తన ప్రతాపాన్ని చూపెట్టింది. బ్రిస్బేన్‌లోని(Brisbane) గబ్బా స్టేడియం(Gabba stadium) లో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపెట్టింది.
దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆ సీన్ మరలా రిపీట్ అయింది. సరిగ్గా 1997లో ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ లో విండీస్ 207 పరుగులతో విజయాన్ని దక్కించుకుంది.
అప్పటినుండి ఆ జట్టు ఆస్ట్రేలియా టీమ్ ను వారి గడ్డపై ఓడించింది లేదు. ఇంకో మూడేళ్లు గడిస్తే మూడు దశాబ్దాలు దాటిపోతుంది అనగా ఇప్పుడు మరలా ఈ విక్టరీని అందుకుని విదయదరహాసం చేసింది.
ఆస్ట్రేలియా అత్యుత్సాహానికి మూల్యం : Defeat Is The Results For Over Enthusiasm
విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 311 పరుగులకె అన్ని వికెట్లు కోల్పోయింది. తరువాత మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా ఓవర్ కాన్ఫిడెన్స్ తో 289/9 వద్ద ఆటను డిక్లేర్ చేసింది. అప్పటికి ఆస్ట్రేలియా జట్టు సారధి కమిన్స్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి 64 పరుగులతో నాట్ అవుట్ గా క్రీజు లోనే ఉన్నాడు.(West Indies Sensational Victory On Australia) జట్టులోని ప్రతి ఒకరిని ఆడేలా చేసి ఉంటె ఆస్ట్రేలియాకి మరిన్ని పరుగులు దక్కి ఉండేవి. కానీ విండీస్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేయాలన్న తపనతో ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసి మూల్యం చెల్లించుకున్నారు.
ఒడి గెలిచిన వెస్ట్ ఇండీస్ : Finally West Indies won the Match
అనుకున్నట్టే ఆస్ట్రేలియా జట్టు విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే అందరిని ఆలౌట్ చేసింది. కానీ ఆతరువాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా మంచి ఆటతీరు కనబరచడం లో విఫలమై చతికిల పడింది. వెస్టీడీస్ వారి ముందు ఉంచిన కేవలం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. నిజానికి ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఆసీస్ జట్టుకి పెద్ద కష్టం కాదు, అది వారికి తృణప్రాయం. అందరు అనుకున్నట్టుగానే ముందు 113 పరుగులకు కేవలం 2 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు విజయం దిశగా పయనించింది ఆస్ట్రేలియా .(West Indies Sensational Victory On Australia) అయితే, కేవలం 94 పరుగుల విషయం లో మ్యాచ్ మొత్తం తలకిందులైంది. ఆటను విండీస్ నెమ్మదిగా తన వైపు తిప్పేసుకుంది. టపటపా వికెట్ల పడగొడుతూ బౌలర్లు చెలరేగిపోయారు. షమర్ జోసెఫ్(Shamar Joseph) అనే బౌలర్ ఆసీస్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్ జట్టుకు మరచిపోలేని విజయాన్ని అందించాడు. షమర్ విసిరిన బంతులకు ఆస్ట్రేలియా 207 పరుగులకె పరిమితం అయింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.